- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022(టిఎస్‌పిజిఇసెట్) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించిన పిజిఇసెట్ పరీక్షకు 12,592 మంది అభ్యర్థులు హాజరయ్యారని కన్వీనర్ పి.లక్ష్మినారాయణ తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలను శనివారం సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వి.వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డి.రవీందర్ తదితరులు పాల్గొంటారు.
PGECET Results 2022 Tomorrow
- Advertisement -