Sunday, February 23, 2025

సర్వర్‌లో సమస్య.. ఆగిన పిజిటి పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పిజిటి గురుకుల ఆన్‌లైన్ పరీక్షలో సాంకేతిక సమస్య తలెత్తింది. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు సర్వర్‌లో సమస్య వచ్చిందని తెలిపారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు ఆన్‌లైన్ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్ష ప్రారంభం కాలేదు. అభ్యర్థులను ఇంకా పరీక్ష కేంద్రాల్లోకి సిబ్బంది అనుమతించలేదు. పిజిటి ఇంగ్లీష్ పరీక్ష కోసం అభ్యర్థులు కేంద్రాలకు భారీగా చేరుకుంటున్నారు. పలుచోట్ల పరీక్ష కేంద్రాల ముందు గురుకుల అభ్యర్థులు బైఠాయించారు. హయత్‌నగర్‌లో పరీక్ష కేంద్రం ముందు అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అభ్యర్థుల ఆందోళన వల్ల రహదారిపై వాహనాలు భారీగా స్తంభించిపోయాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Also Read: బిహార్ కుల గణనకు ఆమోదం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News