Monday, December 23, 2024

కంటి శస్త్ర చికిత్స సులభంగా నిర్వహించేందుకు ఫ్యాకో యంత్రాలు

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్

సంగారెడ్డి: కంటి శస్త్ర చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఫ్యాకో మిషన్‌ను మంత్రి హరీశ్‌రావు పర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రజలు కంటి శస్త్ర చికిత్సల కోసం వేల రుపాయలు ఖర్చు చేసేవారని, ఫ్యాకో యంత్రాలతో కంటి చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఫ్యాకో మిషన్‌తో చికిత్సల ద్వారా కంటికి సురక్షితంగా ఇన్‌ఫెక్షన్‌లు లేకుండా కంటి సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో కంటి శస్త్ర చికిత్సలు సులభంగా మారుతాయన్నారు. కంటి వెలుగు పథకంతో సిఎం కెసీఆర్ ప్రతి గ్రామంలో ప్రజలకు కంటి చికిత్సలు అవసరమైన కళ్ల అద్దాలను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకంతో కంటి సమస్యలు లేకుండా చేయడానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కృషితో జిల్లా ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గాయత్రీ దేవీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, ప్రభుగౌడ్, ఆసుపత్రి సూపరిండెంట్ అనిల్, వైద్య సిబ్బంది తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News