Monday, December 23, 2024

వినగానే పాడాలనిపించే పాట..

- Advertisement -
- Advertisement -

’ఊహలు గుసగుసలాడే’, ’జ్యో అచ్యుతానంద’ వంటి మ్యాజికల్ ఫిలిమ్స్ తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ’ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది.

తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఇవాళే కలిశారు తొలిసారిగా..‘ అంటూ సాగే ఈ పాట మొదటిసారి వినగానే పాడాలి అనిపించేలా ఎంతో అందంగా, అర్థవంతంగా ఉంది. ఈ పాట విడుదల సందర్భంగా గీత రచయిత భాస్కర భట్ల రవికుమార్ మాట్లాడుతూ.. “ఈ పాట చిత్ర నాయకా, నాయికల పరిచయ గీతం అని చెప్పుకోవచ్చు. వారిద్దరూ అసలు ఎవరు..? ఒకరికొకరు పరిచయం ఎలా…? దాని పరిణామ క్రమం ఏమిటి…? కలసిన తరువాత వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి..? అది ఎలా సాగింది…ఈ భావాలన్నింటినీ ఈ గీతంలో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ శైలిలో చెప్పే ప్రయత్నం చేశా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News