Monday, December 23, 2024

’ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది..

- Advertisement -
- Advertisement -

తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హిట్ కాంబినేషన్లలో కథానాయకుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కాంబో ఒకటి. వీరి కలయికలో వచ్చిన ’ఊహలు గుసగుసలాడే’, ’జ్యో అచ్యుతానంద’ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వీరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ’ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. శుక్రవారం ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఫిల్మ్‌మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించి చిత్ర విజయం పట్ల వారికున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత దాసరి ప్రసాద్ మాట్లాడుతూ “ఈ సినిమాలో శౌర్య తన పాత్ర ద్వారా ప్రదర్శించిన ఏడు ఛాయలు అందరికీ ఎంతగానో నచ్చుతాయి. అలాగే మాళవిక ఎంతో సహజంగా నటించింది. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది”అని తెలిపారు. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ “వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా విజయం పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాము”అని అన్నారు.

హీరో నాగశౌర్య మాట్లాడుతూ “మాములుగా మా సినిమా అలా వచ్చింది, ఇలా వచ్చిందని చెబుతుంటాం. కానీ ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు మేం పడిన కష్టం గురించి మాట్లాడుతున్నాం. కేవలం ఫైట్లు చేస్తేనే కష్టపడినట్లు కాదు. మేం దీని కోసం ఎంత కష్టపడ్డాం అనేది సినిమా చూశాక ప్రేక్షకులకు అర్థమవుతుంది”అని చెప్పారు. హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ మా హృదయానికి ఎంతో దగ్గరైన ’ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ సమావేశంలో సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News