Monday, December 23, 2024

విలన్ కూడా హీరోనే

- Advertisement -
- Advertisement -

ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. ఈనెల 14న సినిమా విడుదలవుతున్న నేపధ్యంలో దర్శకుడు ఫణి కృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “క్రేజీ ఫెలో… క్యారెక్టర్ బేస్డ్ మూవీ. హీరో పాత్రని చాలా క్రేజీగా డిజైన్ చేశాం. చెప్పిన మాటని పూర్తిగా వినకపోతే వచ్చే సమస్యలను హిలేరియస్‌గా చూపించాం. చాలా మంచి వినోదం వుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పుడూ వర్కవుట్ అవుతుందని నమ్ముతాను. ఆదిని ఫుల్ లెంత్ లవ్ ఎంటర్‌టైనర్‌లో చూసి చాలా కాలమైంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు మంచి చిరునవ్వుతో బయటికి వస్తారు. ఆది ఇందులో కొత్తగా వుంటారు. ఆయన నటన కూడా కొత్తగా వుంటుంది. ఇందులో యాక్షన్ కూడా వుంది. అయితే ఇందులో విలన్ కూడా హీరోనే. అతని వలన అతనికే సమస్యలు. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఇద్దరు హీరోయిన్ల పాత్రలు కూడా చాలా కీలకంగా ఉంటాయి”అని తెలిపారు.

Phani Krishna about ‘Crazy Fellow’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News