Wednesday, January 22, 2025

మసాలాలో విషం కలిపిన ఫార్మాసిస్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తన ఫార్మాసిస్టు తెలివితేటలను విడిపోయిన భార్య పుట్టింటి వారిని చంపేందుకు వాడాడో వ్యక్తి. బ్రిటన్‌లో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న 45 ఏండ్ల హైదరాబాదీ అతి తెలివిగా విషపూరితమైన అర్సెనిక్ రసాయనాలు కలిపిన కారం, ఉప్పు పొడులను అత్తింటి వారిని అంత మొందించేందుకు ప్రయోగించాడు. వీటిని తీసుకున్న తరువాత అత్తింటి వారు అస్వస్థతకు గురి కాగా , ఫార్మాసిస్టు అత్త 60 ఏండ్ల వృద్ధురాలి మోతాదు వికటించి మృతి చెందిందని స్థానిక పోలీసులు తెలిపారు.

వైవాహిక తగాదాలతో విడాకులకు దిగిన తన భార్య పట్ల అక్కసుతో ఈ వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు నెల రోజుల తరువాత వెల్లడైంది. తన పుట్టింటి వారిపై పొసగని భర్త సాగించిన దురాగతంపై భార్యకు అనుమానం వచ్చి ఫిర్యాదుకు దిగింది. ఈ క్రమంలో ఐపిసి సెక్షన్ల పరిధిలో ఆయనపై , మరో ఆరుగురిపై మియాపూర్ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News