Monday, December 23, 2024

9నుంచి గొర్రెల పంపిణీ

- Advertisement -
- Advertisement -

హైదరబాద్: రాష్ట్రంలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 5నుండి ప్రాంరిభించాలని నిర్ణయించిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదికి మార్చింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి అధికారులును ఆదేశించారు.

గురువారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ కార్యక్రమంలో స్వల్పమార్పులు చేసినట్టు వెల్లడించారు. సమీక్షలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఈ నెల 9 వ తేదీ నుండి ప్రారంభించను న్న 2 వ విడత గొర్రెల పంపిణీ, 8,9,10 తేదీలలో నిర్వహించే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత ము ఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను అమ లు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. చేపట్టిన కార్యక్రమాలు, లబ్దిదారులకు జరిగిన మేలు గురించి కరపత్రాల ద్వారా వివరించాలని సూచించారు.

రాష్ట్రంలో సబ్సిడీ గొర్రెల యూ నిట్లు పొందిన గొర్రెల పెంపకం దారులు, ప్రభుత్వం సబ్సిడీ పై అందజేసిన వాహనాలు, ఉచిత చేప పిల్లల ద్వారా లబ్దిదారులు అత్యధికంగా ఉన్నారని, దశాబ్ది ఉత్సవాలలో పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలని చెప్పారు. ఉత్సవాల నిర్వహణ కు సంబంధించి కార్యక్రమాల పై సమగ్ర కార్యాచరణ ను రూపొందించి జి ల్లా, మండల అధికారులకు పంపింఛి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఆ దేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 3 వ తేదీన తెలంగాణ రైతు దినోత్సవం సందర్బంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాలలో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొనే విధంగా డెయిరీ అధికారులు, మత్స్య శాఖ అధికారులు, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 8 వ తేదీన చెరువుల పండుగ సందర్బంగా ప్రధాన చెరువులు, రిజర్వాయర్ ల వద్ద వేదికలను ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాల ను నిర్వహించాలని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News