Tuesday, November 5, 2024

2023 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పిహెచ్‌డి తప్పనిసరి కాదు

- Advertisement -
- Advertisement -

PhD is not mandatory for assistant professors until 2023

 

న్యూఢిల్లీ : యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అభ్యర్థులు పిహెచ్‌డి పూర్తి చేసి ఉండాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం సడలించింది. యానివర్శిటీ గ్రాంట్ కమిషన్ ఈ చట్టాన్ని 2018 లో చేసింది. ఈ ఏడాది జులై నుంచి దీన్ని అమలు చేయాలని భావించింది. అయితే కరోనా కారణంగా ఈ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజా నిబంధన అమలును 2023 జులై వరకూ వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటివరకూ యూజిసి నెట్ స్కోరు ఆధారం గానే నియామకాలు జరుగుతాయని యూజిసి ఒక ప్రకటనలో వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News