Tuesday, January 21, 2025

పిల్లలపై లైంగిక దాడి… తమిళనాడు పిహెచ్‌డి స్కాలర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పిల్లలపై అత్యాచారాలకు పాల్పడడమే కాక, లైంగిక దాడి చిత్రాలను, వీడియోలను ప్రసారం చేస్తున్న తమిళనాడుకు చెందిన 35 ఏళ్ల పిహెచ్‌డి స్కాలర్‌ను సిబిఐ అరెస్టు చేసింది. నిందితుడు తమిళనాడు తంజావూరుకు చెందిన వ్యక్తి. పిల్లలను లైంగికంగా వేధించే చిత్రాలను , వీడియోలను ఇంటర్‌పోల్ డేటాబేస్‌లో సిబిఐ అధికారులు కనుగొన్నారు. డిజిటల్ ఫోరెన్సిక్ పరికరాలను ఉపయోగించి ఈ సంఘటనలు తంజావూర్ జిల్లాలో జరిగినట్టు తెలుసుకున్నారు. నిందితుని ఆవరణలో సిబిఐ దాడులు చేపట్టి అక్రమంగా ఈ నేరాలకు వినియోగించే ఎలెక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

గతనాలుగేళ్లుగా నిందితుడు పిల్లలను లైంగికంగా వేధించడం సాగిస్తున్నాడని వారి నగ్న దృశ్యాల వీడియోలను ఫోటోలను తన గూగుల్ ద్వారా అప్‌లోడ్ చేస్తున్నాడని సిబిఐ అధికారులు గుర్తించారు. ఇంతేకాక నిందితుడు ఇద్దరు మైనర్లను (మగ, ఆడ) లైంగిక చర్యలకు బలవంతం చేసినట్టు అలాగే ఒక బాలికపై కూడా బలవంతం చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ లైంగిక కార్యకలాపాలను ఫోటోలు తీసి వీడియోలు చిత్రీకరించేవాడని, మరికొంతమంది బాలికలను తీసుకు రమ్మని బలవంతం చేసేవాడని తెలిసింది. అలా చేయకుంటే ఇంటర్నెట్‌లో ఇవన్నీ ప్రదర్శిస్తానని బెదిరించేవాడని బయటపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News