Sunday, December 22, 2024

కోచ్ పదవికి సిమ్మన్స్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Phil Simmons resigns as West Indies coach

అంటిగువా: వెస్టిండీస్ కోచ్ పదవికి ఫిల్ సిమ్మన్స్ రాజీనామా చేశారు. టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ పేలవమైన ప్రదర్శనను బాధ్యత వహిస్తూ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సిమ్మన్స్ వెల్లడించారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో విండీస్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. దీంతో విండీస్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. రెండు సార్లు టి20 ప్రపంచకప్ విజేతగా ఉన్న జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. మరోవైపు జట్టు ఎంపికలో లోటు పాట్లు ఉన్నాయని ఇదే ఓటమికి ప్రధాన కారణమని మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి స్థితిలో సిమ్మన్స్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News