Saturday, November 2, 2024

సల్ఫర్ డైఆక్సైడ్‌ను వెదజల్లుతున్న ఫిలిప్పీన్స్‌లోని తాల్ అగ్నిపర్వతం

- Advertisement -
- Advertisement -

మనీలా: ఫిలిప్పీన్స్‌లోని తాల్ అగ్నిపర్వతం పెద్ద ఎత్తున సల్ఫర్ డైఆక్సైడ్ ను  వెలువరిస్తున్నది. మునుపెన్నడూ లేనంత అత్యధికంగా 25,456 టన్నుల సల్ఫర్ డైఆక్సైడ్‌ను గత కొన్ని రోజులుగా వెలువరుస్తున్నది. ఈ ప్రాంతంలో అగ్నిపర్వత భూకంపాలు, అగ్నిపర్వత వాయువు తాలూకు ప్రాణాంతక సంచితాలు ఏర్పడే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వాల్కనాలజీ అండ్ సెసిమాలజీ హెచ్చరించింది. ప్రస్తుతం సల్ఫర్ డైఆక్సైడ్(ఎస్‌ఓ2) వెల్లువ చాలా ఎక్కువగా ఉంది. దక్షణ లూజన్ వద్ద ఉన్న ఈ అగ్నిపర్వతం, తాల్ సరస్సులో వేడి అగ్నిపర్వత ద్రావకం వల్ల సల్ఫర్‌డైఆక్సైడ్‌ను పెద్ద ఎత్తున వెదజల్లుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News