Sunday, January 19, 2025

సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, యుపిఐ సేవలు

- Advertisement -
- Advertisement -

నల్గొండ:జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా యు. పి.ఐ సేవలు( ఫోన్పే, గూగుల్ పే పేటియం)ఆన్లైన్ ట్రాన్స న్స్ కార్యక్రమాలు నేటి నుండి ప్రారంభించడం జరుగుతుంద ని రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్, ఎన్ డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో యూపీఐ సేవల కార్యక్రమాలను పాలకవర్గం, వివిధ బ్రాంచి మేనేజర్లలతో కలిసి లాంఛనంగా ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ31 బ్రాంచీలలో 2 లక్షల76 వేల ఖాతాదారులు ఉన్నారని అందులో 1లక్ష60 వేల మంది ఖాతాలు కొనసాగుతున్నాయని తెలిపారు.బ్రాంచ్ మేనేజర్లు ఖాతాదారులకు యుపిఐ సేవలపై అవగాహన కల్పించి ఆన్లైన్ కార్యక్రమాలు ఉపయోగించే విధంగా వారికి దోహదపడాలని అన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవింగ్ అకౌ ం ట్స్,కరెంట్ అకౌంట్స్ ఖాతాలు తెరిచే విధంగా బ్యాంక్ సిబ్బంది అవగాహన కల్పించి నూతన ఎకౌ ంట్లు తీయాలని పేర్కొన్నారు.కమర్షియల్ బ్యాంకుల ధీటుగా సహకార బ్యాంకులు ఖాతాదారులకు సేవలందిస్తున్నారని తెలిపారు.

ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. 106 సంవత్సరాల చరిత్రలో ఆన్లైన్ ట్రాన్సస్ కార్యక్రమం ముఖ్య ఘటమని అన్నారు. ఖాతాదారు లు సంబంధిత బ్రాంచీలకు వెళ్లి రిక్వెస్ట్ లెటర్ ద్వారా యూపీఐ సేవలు సద్విని చేసుకోవాలన్నారు. బ్రాంచ్ మేనేజర్లు సిబ్బంది యూపీఐ సేవా కార్యక్రమాలు రోజువారిగా నమోదు చేయాలని అత్యధికం గా ఖాతాదారులకు యూపీఐ సేవలు ఉపయోగించే విధంగా కృషి చేసిన వారికి ప్రమోషన్లకు ప్రాధాన ్యత ఉంటుందని తెలిపారు.గతంలో 9 వందల కోట తో ఉన్న బ్రాంచీలు నేడు పాలకవర్గం, సిబ్బంది కృ షితో 2వేల 3 వందల కోట్ల వరకు పురో అభివృద్ధి చెందాయని అన్నారు. బ్యాంకు ఎన్ పి ఏ 2.03 ప్రకారం ముందుకు పోతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News