Wednesday, April 2, 2025

మొబైల్ స్క్రీన్ వాడకంతో 60 శాతం పెరగనున్న నిద్రలేమి

- Advertisement -
- Advertisement -

నిద్రపోయే ముందు మొబైల్ స్క్రీన్‌ను అదేపనిగా చూస్తూ గడపడం వల్ల 60 శాతం వరకు నిద్రలేమి ముప్పు పెరుగుతుందని , నిద్రాసమయం అరగంటవరకు తగ్గిపోతుందని అధ్యయనంలో వెల్లడైంది. నార్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నార్వేలో 1828 ఏళ్ల వయస్సున్న దాదాపు 45,000 మంది విద్యార్థులపై ఈ అధ్యయనం నిర్వహించింది. నిద్రపోయే ముందు ఎంతసేపు వారు స్క్రీన్‌లో వినోద కార్యక్రమాలు , సినిమాలు వంటివి వీక్షిస్తుంటారో ఆరా తీసింది.మొత్తం సమయమంతా స్క్రీన్లను వినియోగించడంతోనే సరిపోతున్నప్పుడు పక్కపై పడుకునే ముందు స్క్రీన్లను వీక్షించడం ఫర్వాలేదు అనిపించడం లేదని నార్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన పరిశోధకులు గన్నిహిల్డ్ జాన్‌సెన్ జెట్లాండ్ పేర్కొన్నారు. ఈ అధ్యయనం జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ సైకియాట్రీలో ప్రచురించడమైంది. సోషల్ మీడియా, ఇతర స్క్రీన్ కార్యక్రమాలకు మధ్య చెప్పుకోతగిన తేడా ఏదీ కనిపించడం లేదన్నారు.

అయితే పడుకునే ముందు స్క్రీన్‌ను వినియోగించడంతో నిద్రాభంగం కావడం కీలకమైన అంశంగా వివరించారు. స్క్రీన్ వినియోగంతో నిద్ర ఆలస్యం కావడానికి బదులు, ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవచ్చని పేర్కొన్నారు. 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు నిద్రలేమి జరిగితే రాత్రుళ్లు నిద్రలోనే నడవడం వంటివి నిద్రాభంగ సంఘటనలు తరుచుగా జరుగుతుంటాయని పరిశోధకులు పేర్కొన్నారు. నిద్రకు భంగం కలగడం, పడుకునే సమయంలో స్క్రీన్ చూస్తూ గడపడం, స్క్రీన్ కార్యక్రమాలు ఎక్కువసేపు మేల్కొనేలా చేయడం, నిద్రరావడానికి చాలా సమయం పట్టడం వంటి అవలక్షణాలు ఏర్పడతాయని వివరించారు. ఫలితంగా విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాక, చదువులు దెబ్బతింటాయని పేర్కొన్నారు. నిద్రపోయే ముందు స్క్రీన్ సమయం గంటవరకు పెరిగితే 59 శాతం వరకు నిద్రలేమి పెరుగుతుందని, నిద్రపోయే సమయం 24 నిమిషాల వరకు తగ్గిపోతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News