అమరావతి: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఫోన్ ట్యాప్ చేస్తున్నారని వైసిపి తిరుగుబాటు నేత, ఎంఎల్ఎ కోటంరెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై తనకు స్పష్టమైన సాక్షం దొరికిందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌తో దొంగతనంగా తన కాల్స్ వింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపిఎస్ అధికారులకు ఇబ్బందికరపరిస్థితులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. తన దగ్గరున్న ఆధారాలు బయటపెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. అవమానాలు జరిగిన చోట ఉండాల్సిన అవసరం లేదన్నారు. 15 నెలల తరువాత ప్రజలు ఎలా తీర్పిస్తారో ఎవరికీ తెలియదన్నారు. నాయకుడే నమ్మకపోతే ఇక తాను పార్టీలో ఉండేది ఎందుకు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో పార్టీలో ఎన్నో అవమానాలు భరించానన్నారు. జగన్ పైన, వైసిపి పైన ఏనాడు పరుషంగా మాట్లాడలేదన్నారు. బారాషాహిద్ దర్గాకు జగన్ నిధులు మంజూరు చేసినా ఆర్థిక శాఖ విడుదల చేయలేదని కోటంరెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి తరఫున పోటీ చేయనని స్పష్టం చేశారు. తన మనసు వైసిపిలో ఉండొద్దని చెప్పుతుందని హెచ్చరించారు.
ప్రశ్నిస్తే చాలు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: కోటం రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -