Thursday, February 6, 2025

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్‌రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల 12వ తేదీ వరకు రాధాకిషన్‌రావును అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

తన ఫోన్‌ ట్యాప్‌ చేశారన్న చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదుతో రాధాకిషన్‌పై కేసు నమోదు అయ్యింది. దీంతో ఈ కేసును కొట్టివేయాలని రాధాకిషన్‌రావు.. గతంలో హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. తాజాగా ఈ కేసులో దాఖలైన పిటిషన్ పై విచారించిన కోర్టు.. రాధాకిషన్ రావును అరెస్టు చేయొద్దని చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News