Saturday, April 26, 2025

ఫోన్ టాపింగ్ కేసు… ఫడ్నవిస్ వాంగ్మూలం నమోదు

- Advertisement -
- Advertisement -

Phone tapping case :Fadnavis testimony recorded

 

ముంబై : అక్రమ ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి బికెసి సైబర్ పోలీసులు ఆదివారం రెండు గంటల పాటు సీనియర్ బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి ఆయన ఇంటిలోనే వాంగ్మూలం నమోదు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెమ్‌తాజ్‌సింగ్ రాజ్‌పుత్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నితిన్ జాధవ్, మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఆదివారం మధ్యాహ్నం ఫడ్నవిస్ నివాసానికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. ఆ సమయంలో భారీ భద్రత ఫడ్నవిస్ బంగళా వద్ద ఏర్పాటు చేశారు. బిజెపి ఎంఎల్‌ఎ ఆశిష్ సెలార్ దీనిపై మాట్లాడుతూ వారు వాంగ్మూలం తీసుకోనివ్వండి. సత్యం ఎప్పుడూ దాగదు,అది ఓడిపోదు అని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News