Monday, January 20, 2025

ప్రభాకర్‌ రావు ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ మలుపులు తీసుకోవడంతో ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్ర భాకర్‌రావుని ఎలా రప్పించాలనే దానిపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఆయన ఎక్కడ? ఆయనను కాపాడుతున్నది ఎవరు? కేసు నమోదు చేసి 25 రోజులు కావస్తున్నా ప్రభాకర్‌రావును టచ్ చేయకుండా కాపాడుతున్నది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నది. మరోవైపు ప్రభాకర్‌రావు అమెరికాలో తలదాచుకున్నాడనే సమాచారం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఇంటర్‌పోల్ సహాయం తీసుకొని రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్న ఆ దిశగా హైదరాబాద్ పోలీసులు ఎందుకు ప్రయత్నం చేయట్లేదనే దానిపైనా విమర్శలు వ్యక్తం అవుతున్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా, కేసులో నిందితుడని తెలిశాక హైదరాబాద్ సిపికి ప్రభాకర్‌రావు ఫోన్ చేయడం చర్చనీయాంశమైంది. మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తానని సమా చారం ఇచ్చి మరీ ప్రభాకర్‌రావు అందుబాటులో లేకుండా పోవడంతో.. ఆయన దుబాయ్‌లో తలదాచుకుని ఉండవచ్చని పోలీసు వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోందని సమాచారం. అయితే దుబాయ్ వెళ్లి అఫ్రూవర్‌గా మారొద్దంటూ ప్రభాకర్‌రావుకు ఓ పార్టీ నేతలు వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు.

ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్‌రావు ఇండియాలో అడుగు పెట్టిన వెంటనే అరెస్టు చేసి అవకాశం ఉందని తెలిసింది. మరీ ప్రభాకర్‌రావు ఇండియాకు వస్తారా? క్యాన్సర్ చికిత్స పేరుతో కాలయాపన చేస్తారా? అన్న సందేహాలు సైతం పోలీసులు వ్యక్తపరుస్తున్నట్లు తెలిసింది. అయితే, ప్రభాకర్‌రావు వస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు చిక్కుముడులకు సమాధానం లభిస్తుందనేది పోలీసుల అభిప్రాయంగా వినవస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News