Sunday, January 19, 2025

ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త కోణం

- Advertisement -
- Advertisement -

ఓ కానిస్టేబుల్ కోట్లాది రూపాయల దందా!

మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబాటు, 40 మందికి
లైంగిక వేధింపులు గంజాయి కేసు నిందితులకు
బెదిరింపులు, భారీగా వసూళ్లు మునుగోడు
ఉప ఎన్నిక సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంగా
ఆపరేషన్ పేకాట దందాల్లో నెలనెలా మామూళ్లు
ఓ పోలీసు బాసుకు సహకారం ఫోన్ ట్యాపింగ్
కేసులో నేడో,రేపో ఓ ఎంఎల్‌సికి నోటీసులు
ఇచ్చేందుకు రంగం సిద్ధం అప్రూవర్లుగా
మారిన ఇద్దరు ఒఎస్‌డిలు?

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యా పిం గ్ కేసులో ట్విస్టులే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో విస్తుపోయే వాస్తవా లు వెలుగు చూశాయి. నల్గొండ జిల్లా కేం ద్రంగా ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో వెల్లడైనట్లు స మాచారం. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌లో వార్ రూమ్ ఏర్పా టు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఈ ఫో న్ ట్యాపింగ్‌తో రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు, వ్యక్తిగత లబ్ధ్ది కో సం మరికొందరు ప్రయత్నించినట్లు నిర్ధారించినట్లు సమాచారం. మునుగో డు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని, అదే అదునుగా ఓ కానిస్టేబుల్ ఫోన్ ట్యాపింగ్‌తో మహిళల వ్యక్తిగత జీవితాలతో ఆడుకున్నట్లు విచారణలో వెల్లడై నట్లు సమాచారం.

పలువురు మహిళలను కానిస్టేబుల్ బ్లాక్ మెయిల్ చేసినట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. అయితే, అప్పటి జిల్లా పోలీస్ బాస్‌తో సదరు కానిస్టేబుల్‌కు సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ చొరవతోనే ఉన్నతాధికారులను సైతం భయపెట్టాడని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌తో జిల్లాలో పలు దందాల్లోనూ జోక్యం చేసుకుని సదరు కానిస్టేబుల్ కోట్ల రూపాయలు వసూలు చేశాడని సమాచారం. రౌడీ షీటర్లతో సెటిల్‌మెంట్స్ చేయించి, గుర్రంపోడు వద్ద ఓ పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోట విక్రయం చేయించాడని తెలిసింది.

నార్కట్‌పల్లి వద్ద గంజాయి కేసులో దొరికిన వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించిన సదరు కానిస్టేబుల్ వారిని వేధింపులకు గురి చేశాడని సమాచారం. వందల మందికి సంబంధించిన ఫోన్ రికార్డ్స్ విని బెదిరింపులకు పాల్పడి, కోట్లు వసూలు చేసినట్లు తాజా విచారణలో వెల్లడైందని సమాచారం. సుమారు 40 మంది మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశాడని సమాచారం. పేకాట దందాల్లో నెల నెలా మామూళ్లు వసూలు చేసేవాడని తెలిసింది. ఇటీవలే ఈ కానిస్టేబుల్‌తో పాటు మరొకరిని హైదరాబాద్ టీమ్ అదుపులోకి తీసుకోగా విచారణలో ఈ వివరాలన్నీ బయటపడ్డాయని సమాచారం.

ఆ ఇద్దరి రాయబారం
మరోవైపు ఎస్‌ఐబిలో ఓఎస్‌డిలుగా ఉన్న ఇద్దరు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే వీరిద్దరూ ఇంతవరకు పోలీసుల ముందుకు రాలేదు. ఇప్పటికీ వీరు ఓఎస్‌డిలుగానే కొనసాగుతున్నారు. అప్రూవర్స్ గా మారిపోతామనడమే దీనికి కారణమని భావిస్తున్నారు. దీంతో దర్యాప్తు అధికారులు కూడా వీరిపై పెద్దగా దృష్టిసారించకపోవడంతోపాటు విచారణకు హాజరు కావాలనే నోటీసులు కూడా ఇవ్వడం లేదంటున్నారు. అయితే ఒక ఓఎస్‌డి మాత్రం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట హాజరైనట్లు వార్తలొచ్చినప్పటికీ దర్యాప్తు అధికారులు మాత్రం రాలేదని వెల్లడించారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఇతని పేరు వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం పిలవలేదు. దీనికి ప్రధాన కారణం.. తాను విట్ నెస్‌గా మారతానంటూ మధ్యవర్తుల ద్వారా రాయబారం పంపడమే. ఈ కేసు కోర్టులో కూడా బలంగా నిలబడాలన్నా, నిందితులు టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం శిక్ష పడాలన్నా ఇటువంటి విట్‌నెస్‌లు అవసరం.

దీంతో పోలీసులు సైలెంట్ అయ్యారంటున్నారు. ఎస్‌ఐబిలో ఓఎస్‌డిగా చేరిన ప్రభాకర్‌రావుకు శిష్యుడిగా పేరుపడ్డ అధికారి ఒకరు విట్ నెస్‌గా మారనున్నారంటున్నారు. ఎస్‌ఐబిలోని ఇద్దరు ఓఎస్‌డిలు ఇచ్చిన సమా చారంతోనే వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక డెన్ల గురించి పోలీసులు వివరాలు సేకరించారు. వారిచ్చిన సమాచారం ప్రకారం కొంతమం దిని పిలిపించిన పోలీసులు వారి స్టేట్ మెంట్లు రికార్డు చేశారు. జరిగింది మొత్తం చెబుతామని, ఎవరి ఫోన్లు ట్యాప్ చేశామో చెబుతామంటూ సాక్షులుగా మారి వారిపై కేసులు లేకుండా చూసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. దర్యాప్తులో భాగంగా వీరిద్దరి పేర్లను మాత్రం అధికా రులు బయటకు రానివ్వడంలేదు. వీరిద్దరూ విట్‌నెస్‌లయ్యారనే ప్రచారాన్ని నమ్మాలని పోలీసు వర్గాలు అంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News