ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై
రెడ్‌కార్నర్ నోటీసులు జారీ
చేయాలని కోరిన కేంద్ర
దర్యాప్తు సంస్థ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులైన మాజీ ఎస్‌ఐబి చీఫ్ ప్ర భాకర్‌రావు, ఓ తెలుగు న్యూస్ చాన ల్ ఎండి శ్రవణ్‌రావులకు సిబిఐ రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని ఇంటర్ పోల్‌కు సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న ఆ ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రక్రియకు మార్గం సుగమం అయింది. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాల తో సంతృప్తి చెందిన సిబిఐ ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసు జా రీచేయాలని ఇంటర్ పోల్‌ను కోరిం ది.సిబిఐ జారీ చేసిన నోటీసు లతో 196దేశాల ప్రతినిధులను ఇంటర్‌పో ల్ అప్రమత్తం చేయనుంది. ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ఆ దేశం వదిలి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. బెల్జియంలో శ్రవణ్‌రావు, కెనడాలో ప్రభాకర్‌రావు తలదాచుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇంటర్ పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు అన్ని దేశాలకు చేరిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా నిందితులను హైదారాబాద్ తీసుకొచ్చే ఆలోచనలో తెలం గాణ పోలీసులు ఉన్నారు.
ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్…!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్‌రావు అరెస్ట్‌అయిన వెంటనే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్‌రావు కనుసన్నల్లో ట్యాపింగ్ వ్యవహారమంతా జరిగిందని నిర్ధారించింది. ఎ1గా ప్రభాకర్‌రావు పేరును చేర్చింది. అటుపై ఆయన ఆమెరికాలో ఉన్నట్లు గుర్తించింది. అయితే ఈ లోపు ప్రభాకర్‌రావుపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు, లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇప్పట్లో హైదరాబాద్ రాలేనని ప్రభాకర్‌రావు సమాచారమిచ్చారు. కావాలంటే వర్చువల్‌గా విచారణకు హాజరవుతానని తెలియపర్చారు. ప్రభాకర్‌రావు పంపిన లేఖను పోలీసులు నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సదరు విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభాకర్‌రావుతో పాటు ఈ కేసులో ఎ6గా ఉన్న శ్రవణ్‌రావును కూడా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే శ్రవణ్ ఆచూకీని గుర్తించలేకపోయామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. ఇందులో కీలక నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్‌రావు, శ్రవణ్ రావు జాడ తెలియ రాలేదు. వీరిని పోలీసులు విచారిస్తే ఈ కేసుకు ముగింపు దశకు రానుంది. ఈ కేసు గురించి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను నిందితులు తమ వేగుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇద్దరి నిందితుల చుట్టూ ఉచ్చు బిగిస్తుందని తెలుసుకున్న వీరు అమెరికా నుంచి మకాం మార్చినట్టు వార్తలొస్తున్నాయి. నిందితులు ఏ దేశం పౌరసత్వం ఉన్నప్ప టికీ, వారిని అరెస్టు చేసి విచారించే అధికారం ఇంటర్‌పోల్‌కు ఉందని ఓ పోలీసు అధికారి చెబుతున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు తర్వాత ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అమెరికాకు వెళ్లిపోయారు. హైదరాబాద్ పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఏదో ఒక కుంటి సాకు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనారోగ్యం వల్ల అమెరికాలో ఉంటున్నానని మొన్నటివరకు ప్రభాకర్‌రావు సాకులు చెప్పారు . ఇక శ్రవణ్‌రావు అయితే అమెరికా నుంచి దుబాయ్‌కి చక్కర్లు కొడుతున్నట్లు ఆ మధ్య కొందరు రాజకీయ నేతలు బాహాటంగానే చెప్పుకొచ్చారు.