Sunday, December 22, 2024

ఫోన్ ట్యాపింగ్…ఎర్రబెల్లి స్పందన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో వస్తున్న ఆరోపణలపై బిఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఈ కేసుతో తనకెలాంటి సంబంధమూ లేదన్నారు. అరెస్టయిన ఎస్ఐబి మాజీ డిఎస్ పి ప్రణీత్ రావుతో తనకు పరిచయమే లేదన్నారు. కాకపోతే ఆయన బంధువులు మాత్రం తన ఊరిలోనే ఉన్నారన్నారు. ఈ కేసులో తనను అనవసరంగా ఎందుకు లాగుతున్నారో అర్థం కావడంలేదని అన్నారు.

పార్టీ మారాలంటూ తనపై ఒత్తిడి ఉందని, రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా జరుగుతోందన్న అనుమానాన్ని ఎర్రబెల్లి వ్యక్తం చేశారు. అంతేకాక తనపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్న శరణ్ చౌదరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయని దయాకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News