Sunday, January 19, 2025

రోజుకో ట్యాప్ సీక్రెట్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్‌కు వరుసగా మూడోసారి
అధికారమే లక్షంగా ప్రత్యర్థులపై
దాడులు కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు
డబ్బులు అందకుండా ప్రత్యేక టీమ్‌లతో
ఎఎస్‌పి తిరుపతన్న ఆపరేషన్లు
బాధితుల్లో పలువురు ప్రస్తుత మంత్రులు
బిఆర్‌ఎస్ అభ్యర్థులకు టాస్క్‌ఫోర్స్
వాహనాల్లో డబ్బుల తరలింపు స్థిరాస్తి
వ్యాపారిపై ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుకు
ఒత్తిడి, వేధింపులు భుజంగరావు
వాంగ్మూలంలో కీలక విషయాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్‌పి తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి తిరుపతన్న పట్టుకున్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. అంతేకాకుండా, డబ్బులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లతో పాటు పది మంది కానిస్టేబులు, ప ది మంది హెడ్ కానిస్టేబుల్స్‌తో ప్రత్యేక బృందాన్ని తిరుపతన్న ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోప్రతి రోజు 40 మంది సెల్ ఫోన్లను ట్యాపింగ్ చేశారు. మూడు ఉప ఎన్నికలతో పాటు మొ న్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌గా తిరుపతన్న పని చేశారు.

‘పిఒఎల్ 2023’ పేరుతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఎస్‌ఓటి టాస్క్‌ఫోర్స్‌లతో కలిసి తిరుపతన్న పని చేశారు. ప్రణీత్ కుమార్ ఇచ్చిన స మాచారంతో 15 ఆపరేషన్లు నిర్వహించినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. మెరుపు దాడులు చేసి కాంగ్రెస్, బిజెపి సానుభూతిపరుల డబ్బులను తిరుపతన్న సీజ్ చేశారు. ప్రస్తుత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన డబ్బులను పట్టుకున్నారు. రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్‌కు చెందిన డబ్బులను కూడా తిరుపతన్న స్వాధీన పరుచుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రఘురామిరెడ్డి డబ్బులను స్వాధీన పరుచుకున్నారు.

అంతేకాకుండా రాఘవ ఇన్‌ఫ్రాకు సంబంధించిన డబ్బులను పెద్ద ఎత్తున స్వాధీనపరుచుకున్నారు. ఎంఎల్‌ఎ వినోద్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ డబ్బులను పటు ్టకున్నారు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులను తిరుపతన్న సీజ్ చేశారు. మరోవైపు కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటు వెంకటరమణారెడ్డి పైన నిఘా పెట్టారు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లను తిరుపతన్న టీం ట్యాపింగ్ చేశారు. ఈ క్రమంలో మూడు సిస్టమ్స్‌తో పాటు తొమ్మిది లాగర్స్‌ని ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

భుజంగరావు వాంగ్మూలంలోనూ కీలక విషయాలు

తాజాగా అరెస్ట్ అయిన తెలంగాణ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు నేరాంగీకార ప్రకటనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బిఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు అంగీకరించారు. విపక్ష నేతలు, విద్యార్థి నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారని, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలపై నిఘా పెట్టారని వెల్లడయింది. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలోనూ, మూడు ఉప ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని భజంగరావు పోలీసులకు వెల్లడించారు. బిజెపి, కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేశారని, అక్టోబర్‌లో ఎన్నికల సంఘం రాధాకిషన్‌రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. ఎన్నికలకు ముందు బిఆర్‌ఎస్ నేతల ఆదేశాల మేరకు రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో తీసుకెళ్లారని భుజంగరావు వెల్లడించారు.

స్థిరాస్తి వ్యాపారి సంధ్యా కన్వెన్షన్‌కు చెందిన శ్రీధర్ రావును రూ. 13 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేశారని అంగీకరించకపోతే క్రిమినల్ కేసులలో వేధించామని భుజంగరావు వెల్లడించారు. కామారెడ్డిలో కెసిఆర్ పోటీ చేసినందున ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, బిజెపి అభ్యర్థి వెంకటరామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిలపై ప్రత్యేక నిఘా పెట్టామని భుజంగరావు వెల్లడించారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదుల ఫోన్లు ట్యాప్ చేశామని, కెటిఆర్‌ను విమర్శించిన వారందరి ఫోన్లు ట్యాప్ చేశారని వెల్లడించారు.

ఇదిలా ఉండగా, నాంపల్లి కోర్టులో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బెయిల్ పిటిషన్ కు దాఖలు చేశారు. గతంలో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News