Monday, December 23, 2024

2 లక్షల రూపే కార్డులకు లింక్‌తో ఫోన్‌పే రికార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పే యుపిఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)కు 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానం చేసింది. దీంతో మైలురాయిని సాధించిన తొలి యాప్‌గా గుర్తింపు పొందింది. యుపిఐపై రూపే క్రెడిట్ ద్వారా మొత్తం చెల్లింపు విలువ(టిపివి) రూ.150 కోట్లను చేరుకుంది. వినియోగదారులు, వ్యాపారులకు ప్రజాధరణ పొందేలా ఎన్‌పిసిఐ భాగస్వామ్యంతో యుపిఐ రూపే క్రెడిట్ కార్డు సేవలు అందించడమే లక్షమని కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1.2 కోట్ల వ్యాపారుల ఔట్‌లెట్లకు ఇప్పటికే రూపేకార్డు ఆమోదం లభించగా, అత్యధిక వ్యాపారుల రికార్డు సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News