Sunday, November 3, 2024

యుపిఐ యాప్‌లలో ఫోన్‌పే టాప్

- Advertisement -
- Advertisement -
PhonePe Continues to Lead UPI Payments
ఫిబ్రవరిలో రూ.1.89 లక్షల కోట్ల లావాదేవీలు,  మరింత వెనక్కి వాట్సాప్ పేమెంట్

న్యూఢిల్లీ : గత మూడు నెలల్లో అత్యధిక లావాదేవీలతో ఆన్‌లైన్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో టాప్ యుపి ఐ (యునిఫైడ్ పేమెం ట్స్ ఇంటర్‌ఫేస్) యాప్‌గా స్థానం దక్కించుకుంది. మేసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌కు దేశంలో భారీగా వినియోగదారులు ఉన్నప్పటికీ, వేగంగా కస్టమర్లను పెంచుకోవడంలో ఈ సంస్థ పేమెంట్ యాప్ విఫలమైంది. వాల్‌మార్ట్ సహకారంతో నడుస్తున్న ఫోన్‌పే ఫిబ్రవరిలో రూ.1.89 లక్షల కోట్ల విలువచేసే 97.55 కోట్ల లావాదేవీలను నిర్వహించింది. జనవరిలో ఈ సంస్థ రూ.1.91 లక్షల కోట్ల విలువచేసే 96.87 కోట్ల లావాదేవీలను చేపట్టింది. మరోవైపు గూగుల్ పే లావాదేవీలు గతేడాది నవంబర్ (96 కోట్ల లావాదేవీలు) నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలో రూ.1.74 లక్షల కోట్ల విలువచేసే 82.78 కోట్ల లావాదేవీలకు తగ్గుముఖం పట్టాయి. పే టీఎం పేమెంట్ బ్యాంక్ రూ.34,405 కోట్ల విలువచేసే 29 కోట్ల లావాదేవీలను నిర్వహించింది. ఇక ఫిబ్రవరిలో వాట్సాప్ పేమెంట్ యాప్ రూ.32.41 కోట్ల విలువచేసే 0.55 మిలియన్ల లావాదేవీలను నిర్వహించింది. డిసెంబర్ నుంచి వాట్సాప్ లావాదేవీలను తగ్గుముఖం పట్టగా, అప్పుడు 0.81 మిలియన్ లావాదేవీలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News