Thursday, January 23, 2025

ఫోన్‌పేతో మొదటి హెల్త్ ఇన్సూరెన్స్ వేదిక ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అగ్రగామి ఇన్సూరెన్స్ సంస్థల భాగస్వామ్యంతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ ఆవిష్కరించింది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాన్ల ప్రత్యేకత ఏమిటంటే, యుపిఐ నెలవారీ పేమెంట్ పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు వీటిని మరింత సులభతరం చేయడమే. ఇప్పటివరకు సంస్థ 5.6 మిలియన్లకు పైగా పాలసీలను విక్రయించింది. భారతదేశంలో 98 శాతం పిన్ కోడ్లలో పాలసీలను విక్రయిస్తూ, 200 మిలియన్ వాహనాల ఇన్సూరెన్స్ కొటేషన్లకు పైగా సేవలు అందించింది. రూ. 1 కోటి వరకు కవరేజ్ తో పాటు వచ్చే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఎలాంటి పరిమితి లేకుండా ఏ ఆస్పత్రి గదినైనా ఎంచుకునేందుకు వినియోగదారులకు వీలు కల్పిస్తాయని ఫోన్‌పే ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ గాలా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News