- Advertisement -
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పే ఫాస్టాగ్ రిచార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు 26 భాగస్వామ్య బ్యాంకులతో ఫాస్టాగ్ రిచార్జ్ చేసుకునే ఆఫర్‌ను అందిస్తోంది. ఫాస్టాగ్ రిచార్జ్ కోసం అత్యంత సమగ్రమైన బ్యాంక్ కవరేజీని అందిస్తున్నామని ఫోన్‌పే పేర్కొంది. ఈ సౌకర్యం దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది వాహన యజమానులకు ఉపయోగపడుతుందని తెలిపింది. ఫోన్‌పే డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ అంకిత్ గౌర్ మాట్లాడుతూ, ఫాస్టాగ్ రీచార్జ్‌ల రంగంలో వినియోగదారులకు అత్యంత విస్తృతమైన బ్యాంక్ కవరేజీని అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
- Advertisement -