Thursday, January 9, 2025

ఆధార్ కార్డుతో ఫోన్‌పే రిజిస్ట్రేషన్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : భారత్‌లో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్న క్రమంలో ఫోన్‌పే యాప్ ఆదరణ పెరిగింది. 350మిలియన్ల రిజిస్టర్డ్ కస్లమర్లతో ఫోన్‌పే ముందంజలో ఉంది. వినియోగదారుల ను ఆకట్టుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. డెబిట్ కార్డు అవసరం లేకుండానే ఫోన్‌పే ఉపయోగించే సదుపాయం ఫోన్‌పే తమ కస్టమర్లకు కల్పించింది. ఇక నుంచి డెబిట్ కార్డు అవసరం లేకుండానే ఆధార్‌కార్డును ఉపయోగించి యుపిఐను ఏర్పాటు చేసుకోవచ్చు.

తొలుత ప్లేస్టోర్ లేదా యాప్‌స్టోర్ నుంచి ఫోన్‌పేని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం యాప్‌ను ఓపెన్‌చేసి మొబైల్ నంబర్‌ను యాడ్ చేయాలి. ఫోన్ కు వచ్చిన ఓటిపిని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మైమనీ పేజీలో పేమెంట్స్ మెథడ్స్‌పై క్లిక్ చేయా లి. బ్యాంక్‌ను ఎంచుకుని యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్‌పై క్లిక్ చేయండి. ఫోన్ నంబర్ ధ్రువీకరించిన తరువాత అకౌంట్ యుపిఐకి లింక్ అవుతుంది. ఆధార్‌కార్డును ఎంపిక చేసుకోవచ్చు. ఆధార్‌లోని చివరి ఆరు నెంబర్లను నమోదు చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్‌కు ఒటిపి వస్తుంది. ఒటిపిని ఎంటర్‌చేసి యుపిఐ పిన్ నంబర్‌ను సెట్‌చేసుకుంటే సరిపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News