Thursday, January 23, 2025

ఫోన్‌పే కొత్త మైలురాయి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యుపిఐ వాడే వారందరికీ ఫోన్‌పే సుపరిచితమే.ఎక్కువ మంది ఉపయోగించే యుపిఐ యాప్‌లలో ఇదొకటి. ఇప్పుగు ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ ఓ కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగే వార్షిక పేమెంట్ల విలువ ట్రిలియన్ డాలర్ల( రూ.84 లక్షల కోట్ల)కు చేరుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది.2,3,4 టైర్ నగరాలతో పాటుగా దేశంలోని 98 శాతం పిన్‌కోడ్‌లలో మూడున్నర కోట్ల మంది ఆఫ్‌లైన్ మర్చెంట్లకు తాము సేవలందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

యుపిఐ చెల్లింపుల్లో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉన్నామని తెలిపింది. తదుపరి దశలో యుపిఐ లైట్, యుపిఐ ఇంటర్నేషనల్, క్రెడిట్ ఆన్ యుపిఐ వంటి సేవల ద్వారా మరింతగా రాణించడానికి కృషి చేస్తామని ఫోన్ పే కన్జూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌బిఐనుంచి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కూడా పొందినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News