సిఎం రేవంత్‌ను ఇందులోనే అరెస్టు చేశారు
కెటిఆర్ , హరీష్‌రావును ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో చేర్చాలి
బిజెపి మెదక్ ఎంపి అభ్యర్థి రఘునందన్‌రావు డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్ట్ చేశారని బిజెపి మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దీనిని బట్టి 2014 నుంచే ఫోన్ ట్యాపింగ్‌లు జరిగినట్లుగా అర్థమవుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ టెలిఫోన్ల ట్యాపింగ్ మీద చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డిపిజి , ఎస్‌ఐబి చీఫ్ ఎవరున్నారో కూడా చూడాలన్నారు. ఈ వ్యవహారంలో అధికారులను కూడా క్షమించకూడదని రఘునందన్ రావు ఈ సందర్భంగా సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయిగా కెటిఆర్, రెండో ముద్దాయిగా హరీశ్ రావు, మూడో ముద్దాయిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని డిమాండ్ చేశారు. అసలు నిందితులను ముద్దాయిలుగా చేర్చకపోతే కేసు పూర్తి కాదన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. గత డిజిపి పిఎ శ్రీనాథ్ రెడ్డి అధికారిక ఖర్చుతో అమెరికా వెళ్లారని వెల్లడించారు. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదని ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని రఘునందన్ రావు సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినట్లు రఘునందన్ రావు చెప్పారు.