Thursday, January 23, 2025

అక్కన్న మాదన్నలో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం 75వ బోనాల వజ్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం సాయంత్రం ఆలయ ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేసిన 74 ఏళ్ళ బోనాల పొటో ఎగ్జిబిషన్‌ను దక్షిణ మండల డిసిపి సాయి చైతన్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆలయ అధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్, ఎసిపి దామోద్‌రెడి, ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఆలయ ప్రతినిధులతో కలిసి బోనాల ఫొటోలను తిలకించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఫొటో ప్రదర్శన వర్తమాన, భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతుందన్నారు. 74 ఏళ్ళుగా పొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న ఆలయ ప్రతినిధులను అభినందించారు.

వజ్రోత్సవాలను పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల అందజేశారు. అంతకుముందు డిసిపి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలో ఉన్న దర్గాలో చాదర్ సమర్పించి మతసామరస్యాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు జి.రాజరత్నం, డాక్టర్ ఆవుల భరత్ ప్రకాష్, డి.ఆర్.ప్రభాకర్, ఎస్.పి.క్రాంతి కుమార్, ఎం.వినోద్ కుమార్, జగ్మోహన్ కపూర్, జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా శాఖంబరి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారి ముంగిట బి.శృతి, స్నేహ, ఎస్.ప్రణతి, సమీక్షలు స్వాస్తిక్ రూపంలో పూలు, దీపాలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. ఇది భక్తులను ఆకట్టుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News