Wednesday, January 22, 2025

వార్తలకు ఫొటోగ్రఫీ అత్యంత ప్రాముఖ్యత

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : పత్రికల్లో పేజీ నిండా రాసే అక్షరాలకు ఒక ఫోటోగ్రాఫీతో సరిపోతుందని రాష్ట్ర ప్ర భుత్వ సలహదారు డాక్టర్ కేవీ రమణాచారి పేర్కొన్నారు. జర్నలిజం రంగంలోఫొటోగ్రఫీకి అత్యంత ప్రాధాన్యం సం తరించుకున్నదన్నారు. గురువారం సాయంత్రం నాం పల్లిలోని తెలుగువర్సిటీ ఆర్ట్ గ్యాలెరీలో హై అక్టేన్ పక్షాన ప్ర పంచ ఫొటోగ్రఫీకి దినోత్సవాల్లో భాగంగా పోటీల అవా ర్డు గ్రహీతలకు ప్రదానం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఫొటోగ్రఫీకి గొప్ప కళ అ ని, వార్తలకు ఫొటోగ్రఫీకి ముఖ్యమని, వార్తల పరిమళాన్ని ఛాయాచిత్రాలు అందిస్తున్నాయన్నారు. వార్తలకు ఫొటోల కే విలువ ఉంటుందని, ఆరోజుల్లో దేశంలో మాయాబజా ర్ గొప్ప చిత్రంగా చూస్తారు.

సినిమాల్లో ఫోటోగ్రాఫీ అ ద్భుతంగా ఉందన్నారు. పత్రికల ఫోటోగ్రాఫర్లు తమ విధి నిర్వహణలో అద్భుత ఫోటోలు తీశారని, విభన్న ర కాల ఛాయాచిత్రాలు అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రజల ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీగౌడ్, సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ రఫీ, సీనియర్ ఫోటోగ్రాఫర్ కేశవులు, ఎం,మధు, విజయలక్ష్మీలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News