బెంగళూరు : కర్నాటకలోని మురుగమళ్లలో తుళ్లింత. ఆమె క్లాసు టీచరు, అతడు 10వ తరగతి అబ్బాయి. ఈ ఇద్దరు చెట్ల కింద ఎవరేమనుకుంటేనేం అన్నట్లుగా ముద్దులకు , హత్తుకోళ్లకు , ఎత్తుకోళ్లకు దిగారు, అంతా తామే అన్నట్లు ఇతరులతో మాకేమిటి అన్నట్లుగా రోమాన్స్‌కు దిగారు. చెట్ల మాటున పొదల చాటున వీరి సగంసగం రాసలీలల ఫోటోషూట్ అంటే చిత్రీకరణ కూడా జరిగింది. పైగా ఇదంతా కూడా స్కూల్ తరఫున ఏర్పాటు అయిన విద్యా వైజ్ఞానిక యాత్రలో చోటుచేసుకుంది. పైగా ఇది ఎవరివల్లనో కానీ సామాజిక మాధ్యమాలలో చొరబడి విశేష హిట్స్ దక్కించుకొంటోంది. విద్యార్థిపంతులమ్మ కామచేష్టలు మరీ దారుణం అని సామాజికవేత్త అమిత్ సింగ్ రజావత్ ప్రశ్నించారు. ఈ సమాజం ఇట్లా అయితే ఎటుపోతోందని ఈ చిత్తరువులను ప్రస్తావిస్తూ నిలదీశారు.
ఇటువంటివి జరుగుతూ పోతూ ఉంటే చివరికి అనుబంధాలు ఏ దారిన కాటకలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ చెట్లకింది సీనుల ఫోటోషూట్ ప్రచారం కూడా చేయించుకున్న వీరిద్దరూ ఎవరు ? టీచరు ఎవరు? విద్యార్థి ఎవరూ ? అనేది వెల్లడికాలేదు. కర్నాటకలోని చిక్కబళ్లపురం జిల్లా మురుగగమళ్లలోని ఈ ఇద్దరి వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు. తమ పిల్లలను విజ్ఞాన యాత్రకు పంపిస్తే జరుగుతున్నది ఇదా అని పేర్కొంటూ వీరు స్థానిక విద్యాధికారికి లేఖలు పంపించారు. ఇంతకు బరితెగించిన ఈ టీచరు సంగతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.