Monday, March 10, 2025

 స్త్రీవాద కవిత్వం-మూడు ప్రశ్నలు, ముగ్గురు కవయిత్రులు

- Advertisement -
- Advertisement -

1.ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఆధునిక స్త్రీలుగా మీరు స్త్రీ వాదాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు? ఎలా చూస్తున్నారు?
పెనుగొండ సరసిజ: ఒకప్పటి కాలంలో స్త్రీలు పడిన శారీరక గృహహింస ప్రధానంగా మానసిక హింసగా మారింది. స్త్రీలు ఉద్యోగాలు చేస్తు న్నా, రాజకీయంగా ఎదుగుతున్నా, మగవాడి పేరుతో జోడించి ఆమె అస్తిత్వాన్ని చూస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో స్త్రీల మీద వెన్నులో వణుకు పుట్టేంత దారుణాలకు కూడా ఒడిగడుతున్నారు. అంతరిక్షానికి వెళ్లే రోజు లు వచ్చినా కూడా అటు ఇంట్లోనూ, ఇటు బయట పనిచేసే చోట, అన్ని రంగాల్లోనూ స్త్రీలు ఇంకా వివక్షను, సమాజానికి, బయటకు కనబడని హింసను ఎదుర్కొంటూ, చాలాసార్లు దాన్ని కనీసం బహిర్గతం కూడా చేయలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా తన గొంతుకను వినిపించి, సమిష్టిగా పోరాడాల్సిన అవసరం స్త్రీ జాతిపై ఉంది.

ఫణిమాధవి కన్నోజు: ఇప్పటి ఈ పరిస్థితులు స్త్రీకి మరిన్ని సవాళ్ళు విసురుతున్నాయి. విద్య, ఉపాధి, సాంకేతికత ఆహార్యం తదితర అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఆధునికంగా కనపడుతోన్న స్త్రీ జీవితంలోని ఒత్తిళ్ళు సంఘర్షణ మాత్రం ప్రాచీనమే. అవకాశం దొరికినప్పుడల్లా స్త్రీని ద్వితీ య శ్రేణిగా పరిగణించేందుకు సమాజం నిరంతరం ప్రయత్నిస్తునే ఉంది. ఒక్కో మెట్టుగా ఎదుగుతున్న మహిళ ఉన్నత స్థానానికి చేరుకునే క్రమంలో కుటుంబ బాధ్యతలని, వ్యక్తిగత పరిమితులని సాకుగా చూపుతూ పురోభివృద్ధి అవకాశాలకు ఆటంకం కల్పించడం నేటి కార్పొరేట్ ప్రపంచంలో రీతిగా మారుతోంది. ఈ రూపంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష, సంఘటిత రంగంలో ప్రత్యక్ష పరోక్ష లైంగిక వేధింపులు, మతమూ, ధర్మమూ ప్రధాన స్రవంతి రాజకీయాల్లో భాగమవుతున్న సమయంలో స్త్రీ ఒక పావు అవుతోంది. ఇలాంటప్పుడు నా దృష్టిలో ముందుతరం స్త్రీ వాదులంతా చరిత్ర సృష్టించిన స్త్రీలు.

వారి పోరాట ఫలాలే మేం ఇప్పు డు అనుభవిస్తున్నాం. స్త్రీ వాద సాహిత్య చరిత్ర పరికిస్తే ఆ స్వరాలు, ఆ ధిక్కారం తలవంచని ధీరత్వం అద్భుతమే. సమాజంలో పాతుకుపోయిన ఆధిపత్య, అసమ వ్యవస్థను బద్దలుకొట్టి ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం, స్త్రీ పురుషు లు పరస్పరం స్నేహంగా సంచరించే సమాన మానవ సమాజం కోసం గొంతెత్తిన స్త్రీ వాదం కృషి చారిత్రాత్మకం. మాకో దిక్సూచి.

నిర్మలా రాణి తోట: కొంతవరకు ఆర్దిక స్వావలంబన సాధించామే తప్ప నాటికీ నేటికీ ్రస్రీ ఎదుర్కొంటున్న వివక్షలో పెద్ద మార్పేమీ లేదు. నాలుగు గోడల మధ్య, గడప దాటడానికి పోరాడే స్థితిలోంచి బయట పెద్ద ప్రపంచంతో పోరాడాల్సిన పరిస్థితుల్లోకి వచ్చాం. ఉద్యోగం చేసినా ఆ సంపాదన మీద మగవారి పెత్తనమే దాదాపుగా సాగుతోంది. పనిచేసే చోట పని ఒత్తిడి, హేళన, లైంగిక వేధింపుల సమస్యలు, కుటుంబపరమైన బాధ్యతలు, సమస్యలు.. బహుముఖ పాత్రల్లో ్రస్రీలు ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఇంకా పెరిగాయనే భావిస్తున్నాను. అడుగడుగునా ప్రతిఘటన లేకుంటే మనుగడ కష్టమయ్యే కాలంలో స్త్రీవాదం మరింత చైతన్నాన్ని పుంజుకోవాల్సిన అవసరం ఉంది.

2.మీ కన్నా ముందుతరం మహిళా కవులు రాసిన దానికన్నా భిన్నంగా మీరు ఏమి
రాస్తున్నారు?

పెనుగొండ సరసిజ: స్త్రీ ఏది రాసిన వ్యక్తిగతం, అనేటువంటి ఆరోపణ ఇప్పటికీ ఇంకా ఉం ది. ముందు తరం వారు స్త్రీ అస్తిత్వము, అణిచివేత లాంటి ఎన్నో సంఘటనల పైన రాసిన సందర్భా లు, వాటి ఆవశ్యకత ఇంకా పోకపోగా ఎక్కువైపోయింది. అలా అని కేవలం స్త్రీవాదం మాత్రమే రాస్తున్నారు అంటే పొరపాటు. రాజకీయ అంశా లు, రాజ్యాధికారం, స్త్రీ అంతర్లీనంగా అనుభవిస్తున్న వేదనను తన చిన్న చిన్న అవసరాలైన ఆకలి, నిద్ర, స్త్రీకి మాత్రమే సంబంధించిన అనారోగ్య సమస్యలపైన తన లోపలి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.

ఫణిమాధవి కన్నోజు: స్త్రీలకు ఎదురయ్యే ప్రతి సమస్యపైనా ప్రస్తుత తరం మాట్లాడుతోంది. రాజ్యాన్నీ ధిక్కరించేందుకు వెరవనితనం ఇప్పటి తరం చూపుతోంది. నాణేనికి మరోవైపు నిజానికి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం మాకు ఆత్మవిమర్శ లాంటిది. అందుకే నిజాయితీగా చెప్పాలనుకుంటున్నా. ‘భిన్నంగా’ గురించి మాట్లాడేముందు ప్రస్తుత కాలం గురించి కొంత. ‘సమానత్వం’ భావ న సరిగ్గా గుర్తించలేని సమాజంలో స్త్రీ – కుటుంబం, కెరీర్ పిల్లలు మధ్య మరిన్ని సవాళ్ళను ఎదుర్కొంటోంది. కుటుంబ వ్యవస్థ రూపురేఖలు మరింత అల్లకల్లోల్లోలంగా మారాయి. సమాజ పరంగా రాజకీయ పరంగా ఒత్తిళ్ళు మరికాస్త రూపుమార్చుకుని పదింతలయ్యాయి. పరస్పర సహకారం, ప్రజాస్వామికత అం దని ద్రాక్ష. కొన్ని చోట్ల మినహాయింపులు ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో భిన్న త్వం పెద్దగా కనిపించకపోవచ్చు. మునుపటి స్త్రీ వాద ధోరణిని కొనసాగించేందుకూ ప్రతికూల స్థితులున్నాయి. అయినా స్త్రీలు కవిత్వంలో నిరంతరాయ కృషిని కొనసాగిస్తున్నారు. ప్రతిఘటన పలికించటంలో రాజీ పడట్లేదు.

అయితే ఇక్కడ మరొక వాస్తవాన్నీ చెప్పుకోవాలి. ఎన్నెన్నో అవమానాలు, కంటకాలు దాటుకుని ’స్త్రీ ల యొక్క స్త్రీ ల కొరకు స్త్రీ ల చేత’ లాగా ఉప్పెన లాగా ఎగసింది స్త్రీ వాదం. అదే స్థాయిలో వారి చుట్టూ అపోహలు అపనిందలు అల్లి, స్త్రీ వాది అనగానే అదేదో పలకరాని నిషేధపదం లాగా ఓ గాజుతెరను దాని చుట్టూ నిర్మించింది సమాజం. మంచి కన్నా చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. స్త్రీ వాదం నెరపిన కృషి కంటె, దానిపై వచ్చిన అపనిందలే అధిక ప్రాచుర్యం పొం దడం విషాదం. స్త్రీ వాదం అసలు ఉద్దేశ్యాన్ని దృక్పథాన్ని తరువాతి తరానికి చేర్చకుండా ఈ గాజుతెర ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్త్రీ వాదాన్ని దాని చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేసి ఇప్పటి కా లానికి అన్వయం చేసుకునేందుకు సిద్ధమైనప్పుడు ఆ గాజుతెర బద్దలవుతుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసే శాతం కొందరు, ఎలాగైనా ఎదిరించి తీరుతాం ప్రశ్నించి చూద్దాం అనే శాతం కొందరూ ఎప్పుడూ ఉన్నారు.

స్త్రీల మధ్య స్నేహ వాతావరణాన్ని సిస్టర్ హుడ్ ను పెంపొందించుకోవడం అత్యంత అవసరం. స్త్రీల రచనల చుట్టూ చేరే కపట సహానుభూతిపరుల అసలు ముఖాన్ని గుర్తించటమూ అదనపు సవాలు. నిర్మలా రాణి తోట: ్రస్రీలు ప్రేమ-విరహం, వాళ్ళ కష్టాలు-కన్నీళ్ళు మాత్రమే రాస్తారు అన్న చిన్నచూపు దాటుకొని సామాజిక, రాజకీయ అం శాలపై విరివిగా రాస్తు న్నాం.. అందుబాటులో కి వచ్చిన సోషల్ మీడి యా ద్వారా దుర్మార్గాలపై తక్షణ స్పందనగా కవిత్వం రాస్తున్నాం. కరోనా కష్టకాలం, ఆయేషా, నిర్భయ లాం టి అత్యాచార ఘటల నుండి ప్రొఫెసర్ సాయిబాబా గారిపై కవితల దాకా కవయిత్రుల సంపాదకత్వంలో పుస్తకాలు వచ్చాయి.

3. ఎప్పటి నుండి మీరు రాస్తున్నారు?
అచ్చయిన మీ రచనలు ఏమిటి?
సరసిజ: 1995 నుండి చాలా అరుదుగా చిన్నవిగా రాసుకున్న కవితలు ఉన్నను, 2007లో ప్రైవేటు టీచర్ గా ఉన్నప్పుడు పిల్లల కోసం, ప్రత్యేకమైన రోజుల కోసం రాసుకున్న కవితలు. సీరియస్ గా మొదలు పెట్టింది మాత్రం 2014 నుండి.
అచ్చు అయిన కవితా సంపుటాలు:
– కాగితాన్ని ముద్దాడిన కల (2018)
– ఇక మారాల్సింది నువ్వే (2021)
– పద అలా నడిచొద్దాం (2025)
ఫణిమాధవి కన్నోజు: రాయటం అనేది తర చూ ఎప్పటినుంచో ఉంటున్నప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చినవి, అనేక పత్రికలలో నిర్వహించిన శీర్షికలు వ్యాసాలు వంటివైతే ఎనిమిదేళ్లుగా రచన వ్యాసంగంలో ఉన్న ట్టే. స్త్రీల సమస్యలపై మానవి వంటి పత్రికల్లో వ్యా సాలు దినపత్రికల్లో సంకలనాల్లో కథలు కవితలు కూడా అచ్చుకు నోచుకున్నాయి. కవిసంగమం లో కవితాంశ కాలమ్ ద్వారా కవిత్వ విశ్లేషణలు రాస్తున్నాను.
– కవిత్వ సంపుటి ’సామభేద’ 2023. వ్యాస సంపుటి 2024లో ’మేఘాల నీలాల్లోకి’ – మహిళా కవిత్వ అవలోకనం .
నిర్మలా రాణి తోట: 8వ తరగతిలో ఉండగా నా మొదటి కవిత స్థానిక పత్రికలో ‘జీవగడ్డ‘లో అచ్చు అయ్యింది. చాలాకాలం డైరీల్లో రాసుకుంటూ ఉన్నప్పటికీ సాహిత్య సమాజంలోకి వచ్చి సీరియస్‌గా రాయడం మొదలు పెట్టింది 2013లో.
అచ్చు అయిన కవితా సంపుటాలు:
లోపలిమెట్లు (2014)
ఒక చినుకు కోసం (2018)
అద్దం నా చిరునామా కాదు (2023).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News