Wednesday, January 22, 2025

అందరికీ ఆల్ ది బెస్ట్.. తపనతో ప్రాక్టీసు చేయండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ఫిజికల్ టెస్ట్ అభ్యర్థులు తపనతో ప్రాక్టీసు చేయాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పోలీసు కొలువు చేసేందుకు ఇలా అంది వచ్చిన ఈ కేసీఆర్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కోరారు. సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూలులో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు జరుగుతున్న ఉచిత శారీరక దృఢత్వ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు.

పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ జరుగుతున్న తీరు, పీఈటీలు ఇస్తున్న శిక్షణను గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. నిష్ణాతులైన పీఈటీలు క్రమం తప్పకుండా వచ్చి స్త్రీ, పురుష అభ్యర్థులకు సరైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ మంది అభ్యర్థులు శిక్షణకు వస్తున్నారని నిర్వాహకులు మంత్రి దృష్టికి తేగా, శిక్షణకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్డు అందేలా చూడాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News