Tuesday, December 24, 2024

ఉష్ణోగ్రత మాపకాలు

- Advertisement -
- Advertisement -

వాయు ఉష్ణోగ్రత మాపకాలు

Temparatures high in Telangana for next 5 days

ఘన, ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువుల ఉష్ణవ్యాకోచం అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి వాయువులైనా ఉపయోగించవచ్చు.
ఇవి పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి.
అందువల్ల వీటిని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లడం సాధ్యం కాదు.
వీటిలో హైడ్రోజన్, నైట్రోజన్, హీలియంలతో పాటు ఏ వాయువులైనా నింపవచ్చు.
నిరోధక ఉష్ణోగ్రతా మాపకాలు
లోహాలను వేడిచేస్తే వాటి నిరోధం పెరుగుతుందనే సూత్రం ఆధారంగా ఈ ఉష్ణోగ్రతామాపకాలు పనిచేస్తాయి.
కాని వేర్వేరు లోహాల నిరోధాలు వేర్వేరుగా ఉండటం వల్ల వీటిని ఉపయోగించి ఉష్ణోగ్రతలను కచ్చితంగా కొలవలేం.
నిరోధక ఉష్ణోగ్రతామాపకాల్లో ప్లాటినంను వాడతారు.
దీనిని ఉపయోగించి కొలిచే ఉష్ణోగ్రత స్థాయి 200 డిగ్రీ సెంటీ గ్రేడ్ నుండి 1200 డిగ్రీ సెంటీగ్రేడ్.
అయస్కాంత ఉష్ణోగ్రత మాపకం
పరమశూన్య ఉష్ణోగ్రత 273 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 0 డిగ్రీ kను కొలవడానికి ఈ ఉష్ణోగ్రతామాపకాన్ని ఉపయోగిస్తారు.
l సాధారణంగా ద్రవస్థితిలో ఉన్న హీలియంను ఇలాంటి మాపకాల్లో వాడుతారు.
ఉష్ణవిద్యుత్ ఉష్ణోగ్రత మాపకం
l దీన్ని ఉపయోగించి క్రిమికీటకాల ఉష్ణోగ్రతలను 0.025 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కచ్చితంగా కొలవవచ్చు.
l ఇలాంటి ఉష్ణోగ్రతా మాపకాలను sb, Bi అనే ఉష్ణయుగ్మంతో నిర్మిస్తారు.
l బెక్‌మెన్స్ ఉష్ణమాపకం: వివిధ స్వభావాలు ఉన్న నీటి ఆవిరి ఉష్ణోగ్రతలను కొలవడానికి..
ఉదా:
1. స్వచ్ఛమైన నీరు 100 డిగ్రీ సెంటీగ్రేడ్
2. సముద్ర జలం 101 డిగ్రీ సెంటీగ్రేడ్
3. మలినమైన నీరు 99 డిగ్రీ సెంటీగ్రేడ్
l బెథిస్కోప్ : దీనిని సముద్ర గర్భంలో ఉన్న ఉష్ణోగ్రతలను కొలవడానికి జలాంతర్గామిలో అమరుస్తారు.
l ఆప్టికల్ పైరోమీటర్: సూర్యుడు లేదా నక్షత్రాల్లో ఉండే అధ్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగిస్తారు.
l పైరోమీటర్, ఆప్టికల్ పైరోమీటర్‌లు ఉష్ణ వికిరణం ఆధారంగా పనిచేస్తాయి.
l పాదరసం: ఇది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో లభించే ఒక లోహ మూలకం.
l పాదరసం సిన్నాబార్ (మెర్కురిక్ సల్ఫైడ్) రూపంలో ఖనిజంగా లభిస్తుంది.
l స్వభావ రీత్యా వెండిలా మెరవడం వలన దీనిని క్విక్‌సిల్వర్ అని కూడా అంటారు.
l పాదరసం లోహాలతో చర్చ జరిపినప్పుడు ఏర్పడిన పదార్థాలను అమాల్గమ్‌లు అంటారు.
l ఇది ఇనుముతో చర్య జరుపదు. కాబట్టి దీనిని ఇనుప పాత్రలో రవాణా/నిల్వ చేస్తారు.
l పాదరసం మంచి ఉష్ణవాహకం, విద్యుత్ వాహకం.
l పాదసరం కాలుష్యం వల్ల మినమిటా అనే వ్యాధి వస్తుంది.
l తొలిసారిగా ఈ వ్యాధిని జపాన్‌లో కనుగొన్నారు.
అనువర్తనాలు
ఇన్సార్ స్టీల్ అనే పదార్థంలో సంకోచ, వ్యాకోచాలు పరిగణనలోకి తీసుకోలేనంత తక్కువగా ఉంటాయి. దీనిని శృతి దండం, మీటర్ స్కేల్, గడియారాలలో వాడుతారు.
బిట్ పాయింట్స్..
l ఎడారి ప్రాంతంలో పగటి పూట చాలా వేడిగాను, రాత్రి వేళలో చల్లగా ఉండటానికి కారణం?
l ఆ ప్రాంతంలోని ఇసుక, భూమి కంటే తొందరగా వేడెక్కుతుంది. తొందరగా చల్లారుతుంది.
l ఉష్ణ దేశాలలో ద్రవ ఉష్ణమాపకాలలో ఆల్కహాల్‌ను ఎందుకు ఉపయోగించరు?
l ఆల్కహాల్ గది ఉష్ణోగ్రత వద్ద మండే స్వభావాన్ని కలిగి ఉండటం వలన.
l టీని తొందరగా సేవించాలనే వ్యక్తి సాసర్‌లో ఎందుకు తాగుతాడు?
l ఉపరితల వైశాల్యం పెరిగే కొద్ది భాష్పీభవనరేటు పెరుగుతుంది.
l చలికాలంలో లోహపు ముక్క, చెక్కముక్క ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పటికీ లోహపు ముక్క చల్లగా ఉండటానికి కారణం?
l లోహపు ముక్క ఉత్తమ ఉష్ణవాహకం
l అరచేతిలో పెట్రోల్, ఈథర్‌ను ఉంచినప్పుడు చేయి చల్లబడుతుంది ఎందుకు?
l ఇగురుట (ద్రవ పదార్థం కొంత వరకు ఆవిరై .. పరిసరాల ఉష్ణోగ్రత తగ్గుతుంది)
l ఆ కర్పూరాన్ని పళ్లెంలో ఉంచి వేడికి గురిచేసిన అది ద్రవరూపంలోకి మారకుండా నేరుగా ఆవిరి అవుతుంది.
l దీనిని ఉత్పతనం అంటారు.
l నూనె కంటే నీరు ఆలస్యంగా వేడెక్కడానికి కారణం?
l నీటికి నూనె కంటే విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటుంది.
l సాధారణ మానవుని శరీర ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటీగ్రేడ్ (98.4‘F)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News