అమరావతి: కర్నూలు జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. ఆదోనిలో కులాంతర వివాహం చేసుకున్నాడని దళిత యువకుడిని పట్టపగలే దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురజాలకు చెందిన ఆడమ్ స్మిత్ అనే వ్యక్తి ఆదోనిలో ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన మహేశ్వరితో ప్రేమలో పడ్డాడు. మహేశ్వరి కుటుంబ సభ్యులకు తెలియడంతో వెంటనే ఆమెకు మరోక వ్యక్తితో నిశ్చితార్థం చేశారు. బ్యాంక్ జాబ్స్‌కు కోచింగ్ తీసుకుంటానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మహేశ్వరి నవంబర్ 12న హైదరబాద్‌లోని ఆర్యసమాజ్‌లో అడమ్ స్మిత్‌ను పెళ్లి చేసుకుంది. తమ తల్లిదండ్రులతో ప్రాణాపాయం ఉందని కర్నూలు ఎస్పీ ఫక్కీరప్పను నవదంపతులు కలిశారు. ఇరు కుటుంబాల సభ్యులను స్టేషన్‌కు సదరు ఎస్పీ రప్పించారు. మహేశ్వరి తల్లిదండ్రులు ఎంత బతిమిలాడిని పుట్టింటికి రాలేనని చెప్పడంతో ఇరు కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఊళ్లోకి వస్తే తన పరువు పోతుందని మహేశ్వరికి తల్లిదండ్రులు చెప్పడంతో ఆదోనిలో రూమ్ రెంట్‌కు తీసుకొని నవదంపతులు ఉంటున్నారు. ఆదోనిలో నూతన సంవత్సరం సందర్భంగా ఆడమ్ కేక్ తీసుకొని ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో అతడిని ఇద్దరు వ్యక్తులు అడ్డగించి ఇనుప రాడ్లతో దాడి చేయడంతో కిందపడిపోయాడు. స్థానికులు హంతకులను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించిన వీలు కాకపోవడంతో బండరాయి తీసుకొచ్చి అతడి తలపై వేశారు. ఆడమ్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఎక్కువ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకే తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని ఆడమ్ తండ్రి నాగన్న ఆరోపణలు చేస్తున్నాడు. తనని క్షమించాలని మావయ్య అంటూ ఆయన కాళ్లను మహేశ్వరి పట్టుకొని వేడుకున్న దృశ్యాలను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.
ఆదోనిలో పరువు హత్య…
- Advertisement -
- Advertisement -
- Advertisement -