Monday, January 20, 2025

హైదరాబాద్‌లో గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఇటాలియన్‌ పియాజియో గ్రూప్‌, ప్రతిష్టాత్మక వెస్పా, ఏప్రిలియా శ్రేణి స్కూటర్ల తయారీదారుకు 100% అనుబంధ సంస్థ పియాజియో ఇండియా నేడు రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని తమ వినియోగదారులకు గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ ను నిర్వహించింది. దాదాపు 300 మంది రైడర్లు ఈ రైడ్‌లో పాల్గొనగా, వీరిలో 100మందికి పైగా మహిళా రైడర్లు కూడా ఉన్నారు. ఈ రైడ్‌, హైదరాబాద్‌లోని అన్ని పియాజియో షోరూమ్‌ల వద్ద ప్రారంభమై, వెస్లీ కాలేజీ వద్ద కలిసింది. అక్కడ నుంచి గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ అధికారికంగా ప్రారంభమై, హైదరాబాద్‌లోని పలు ముఖ్యమైన ప్రాంతాలు, కూడళ్లు ద్వారా దాదాపు 200 కిలోమీటర్లు తిరిగి చివరకు సోమాజీగూడాలోరి పార్క్‌ హోటల్‌ వద్ద ముగిసింది.

పూర్తి సరికొత్త, పూర్తిగా పునః రూపకల్పన చేసిన, ఐ–గెట్‌ ఇంజిన్‌ కలిగిన ఏప్రిలియా ఎస్‌ఆర్‌ 160ను ఇక్కడ ప్రదర్శించారు. పియాజియో విడుదల చేసిన అత్యంత వేగవంతమైన స్కూటర్‌ ఇది. అత్యద్భుతమైన లుక్‌, శైలి, కేవలం 7.5 సెకన్లలో గంటకు 60 కిలోమీటర్ల వేగం అందుకునేలా మెరుగైన పికప్‌, అత్యున్నత ప్రదర్శనతో అభిమానులకు నూతన ప్రాధాన్యతా ఎంపికగా నిలుస్తుంది. వెస్పా, ఏప్రిలియా బ్రాండ్‌ విలువలను వినియోగదారులు ప్రత్యక్షంగా అనుభవించే అవకాశాన్ని అందించడంతో పాటుగా ఐ–గెట్‌ ఇంజిన్‌తో కూడిన తాజా ఏప్రిలియా 160ను టెస్ట్‌ డ్రైవ్‌ చేసే అవకాశం సైతం అందించారు.

రోడ్డుభద్రత అవగాహన కల్పించడంలో అత్యంత చురుగ్గా వ్యవహరించే షైన్‌ ఎన్‌జీవో సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంది. హైదరాబాద్‌లోని పియాజియో డీలర్లు 50కు పైగా హెల్మెట్‌లను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పొలీస్‌ కు అందజేశారు. వీటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ బిజినెస్‌ హెడ్‌ 2–వీలర్‌ శ్రీ బిజు సుకుమరన్‌, రీజనల్‌ బిజినెస్‌ మేనేజర్‌ క్రాంతి కుమార్‌, డీలర్‌ పార్టనర్స్‌ , షైన్‌ ఎన్‌జీవో ఫౌండర్‌ సీహెచ్‌ పరమేశ్వరి, షైన్‌ సీఈఓ సీహెచ్‌ మధుసూదన్‌ గౌడ్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ రాజేంద్ర పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News