Saturday, January 11, 2025

టెక్నాలజీకి అనుగుణంగా మారాల్సిందే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందా? దీనిపై ఇప్పుడు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ స్పందించారు. చాట్ జిపిటి, బింగ్ ఎఐ, బార్డ్ వంటి ఎఐ -ఆధారిత చాట్‌బాట్‌లను పబ్లిక్‌గా ప్రారంభించిన తర్వాత ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోతామనే ఆందోళన పెరిగింది. ఈ చాట్‌బాట్‌లు కథనాలను రాయగలవు, కోడ్‌ని సమీక్షించగలవు, టెక్ట్ ఇన్‌పుట్ ఆధారంగా చిత్రాలను కూడా సృష్టిస్తాయి. అందుకే రచయితలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఆర్టిస్టులు తమ ఉద్యోగాలు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ పాడ్‌కాస్ట్‌లో సుందర్ పిచాయ్ ‘ఎఐతో ప్రమాదంలో ఉద్యోగాలు’ అనే అంశంపై మాట్లాడారు.

ఎఐ టెక్నాలజీ ఉద్యోగుల స్థానాల్ని భర్తీ చేస్తుందా? అనే అంశంపై పిచాయ్ స్పందిస్తూ, బార్డ్, చాట్‌జిపిటి వంటి ఎఐ ప్లాట్‌ఫామ్‌ల పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. ఎవరైనా టెక్నాలజీకి అనుగుణంగా మారాల్సిందేనని అన్నారు. ఎఐ టేక్నాలజీ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఉందనే ఆందోళనలను ఆయన ధృవీకరించలేదు. కానీ ఉత్పాదకత విషయంలో ఎఐల పనితీరును పిచాయ్ కొనియాడారు. ఏదైనా సాంకేతికత అనుకూలమైనదిగా ఉండాలని పిచాయ్ చెప్పారు. ఎఐ టెక్నాలజీ వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కూడా కొన్ని విషయాలు నిజమవుతాయని భావిస్తున్నానని, మొదటి విషయం ఏమిటంటే ప్రోగ్రామింగ్ మెరుగుపడుతుంది. కాలక్రమేణా ప్రోగ్రామింగ్ మరింత సరదాగా మారుతుందని అన్నారు. చాట్‌జిపిటి, బార్డ్ వంటి సాధనాలు ప్రోగ్రామింగ్‌ను మరింత అందుబాటులోకి తెస్తాయని పిచాయ్ అభిప్రాయపడ్డారు. ఇది విభిన్న పాత్రలను, కొత్త వస్తువులను సృష్టించడానికి వినియోగదారులను అనుమతిస్తుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News