Thursday, January 23, 2025

భట్టిని కలిసిన పొంగులేటి, పిడమర్తి రవి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ఖమ్మం సభలో చేరికలపై చర్చ జరిగింది.  బిఆర్‌ఎస్ నేత పిడమర్తి రవి భట్టి శిబిరానికి చేరుకున్నారు. ఎల్లుండితో భట్టి పాదయాత్రకు వంద రోజులు కానుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లిలో భట్టి విక్రమార్కను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్‌ఎస్ నేత పిడమర్తి రవి కలుసుకున్నారు. పాదయాత్ర ముగింపు సభపై ఇద్దరు మధ్య చర్చ జరిగింది. భట్టి మార్చి 16న ఆదిలాబాద్‌లోని పిప్పని గ్రామంలో పాదయాత్ర ప్రారంభమైంది. జూన్ 25వ తేదీన ఖమ్మంలో ముగియనుండడంతో భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టాలని యెచిస్తోంది. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దోపిడీకి గురవుతోందని భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, పొంగులేటి చేరిక సభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని భట్టి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News