Wednesday, January 22, 2025

మైనర్ బాలుడిపై పైశాచికం

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: మైనర్ బాలుడిపై దారుణం జరిగిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బాలుడి తండ్రి కథనం మేరకు.. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గట్టు సతీష్ తొమ్మిదేళ్ల కుమారుడు మూడవ తరగతి చదువుతున్నాడు. కాగా ఈ బాలుడిపై ట్రాక్టర్ డ్రైవర్, మరో బాలుడు పైశాచికంగా ప్రవర్తించారు. సెలవు కావడంతో పిల్లలతో కలిసి స్కూల్ దగ్గర ఆడుకుంటుండగా కంటి వెలుగులో వాడి పడేసిన కాటన్, అట్ట ముక్కలను బాలుడి కుడి కాలుకు కట్టి అగ్గిపుల్లతో నిప్పంటించారు. దీంతో బాలుడు మంటలు అని అరుస్తూ ఉండటంతో వారు పారిపోయారు. కాగా ప్రస్తుతం ఆ బాలుడు హన్మకొండలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రఘునాథపల్లి మండలం కిలాసాపూర్‌కు చెందిన బాలుడు కొత్తపెల్లి గ్రామంలో గత రెండేళ్లుగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, చిల్లర మల్లరగా ఉంటూ డ్రగ్స్ తీసుకుంటున్నాడని బాలుడి తండ్రి ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాలుడి తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News