Monday, December 23, 2024

ఆధ్యాత్మిక చింతనతో దైవభక్తి

- Advertisement -
- Advertisement -
  •  చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

మొయినాబాద్: ఆధ్యాత్మిక చింతనతో ప్రజలకు దైవ భక్తి కలుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని ఎత్‌మార్‌పల్లి గ్రామ సమీపంలో బ్రహ్మశ్రీ భాగంపూడి శివకుమార్‌శర్మ, అశోక్‌కుమార్, రాయపూడి శ్వేత కలిసి ఏకత్వం హైందవ ధర్మపీఠం స్మటిక లింగ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం శనివారం వేద పండితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణలతో స్మటిక లింగం ప్రతిష్ఠించి లింగాభిషేకం నిర్వహించారు.

అనంతరం ఆలయ ప్రారంభోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్ని స్మటిక లింగానికి లింగాభిషేకం నిర్వహించి మాట్లాడారు. ప్రజలు భక్తిభావాన్ని కలిగి ఉన్నప్పుడే సంతోషంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు చింతకింది ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎంపిటిసి రవీందర్, రాజు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News