Monday, December 23, 2024

రక్తపు మరకలు.. ఉర్దూ అక్షరాలు..పావురం తెచ్చిన రహస్య సందేశం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: పావురాన్ని వాంతి సందేశంగా విశ్వసిస్తారు ప్రజలు. అయితే రక్తపు మరకలతో కూడిన ఒక సందేశాన్ని తీసుకువచ్చిన ఒక పావురాన్ని చూసి ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు విస్తుపోతున్నారు. ఇంతకీ ఆ పావురం తెచ్చిన సందేశం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే. కాన్పూర్‌లో కటారా గ్రామంలో ధర్మేంద్ర కుష్వాహా అనే రైతు గత గురువారం తన ఇంటి వద్ద పశువులకు మేత పెడుతుండగా ఒక బూడిద రంగు పావురం వచ్చి ఆయన గుమ్మం ముందు కూర్చుంది. అది పదే పదే వస్తుండడంతో ఆయన దాని దగ్గరకు వెళ్లాడు. దాని మెడలో ఒక తాయెత్తుతోపాటు కాగితం కనిపించడంతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

అయితే అది బెదిరిపోయి ఎగిరిపోతోందే తప్ప చేతికి చిక్కడం లేదు. ఇరుగుపొరుగువారి సహాయంతో ఆయన ఎలాగోలాగా ఆ పావురాన్ని చేజిక్కించుకున్నాడు. దాని మెడలో ఉన్న కాగితాన్ని విప్పి చూస్తే అందులో ఉర్దూలో రాసిన అక్షరాలు కనిపించాయి. ఏడు వరుసల్లో రాసిన ఆ దర్దూ పదాలు ఏమిటో ఆయనకే కాక అక్కడున్న వారు ఎవరికీ అర్థం కాలేదు. కాగితానికి మరోపక్కన రక్తపు మరకలు కనిపించడంతో ఆ ఉత్తరాన్ని ఎవరు రాసి పావురానికి కట్టి పంపారో అంతుపట్టకుండా ఉంది.

వెంటనే ఆ పావురాన్ని ఒక పంజరంలో పెట్టి పోలీసులకు కబురందించారు గ్రామస్తులు. అక్కడకు చేరుకున్న ఘటంపూర్ ఎసిపి దినేష్ కుమార్ శుక్లా ఆ కాగితంలో రాసిన పంక్తులను చదవగల ఉర్దూ నిష్ణాతుల కోసం కబురుపెట్టారు. ఆ పావురం మెడలో తాయెత్తు కట్టి దానికి కాగితం చుట్టి ఉందని ఎసిపి చెప్పారు. పంజరంలో ఉన్న పావురాన్ని బయటకు పంపినా అది పోవడం లేదని, అక్కడే తిరుగుతోందని ఆయన చెప్పారు. ఈ మిస్టరీని త్వరలోనే తేలుస్తామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News