ముంబై: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వందనా షా అనే న్యాయవాది కోర్టులో ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఇదే సమయంలో రూ.1000 కోట్లు విరాళం ఇవ్వాలని అందులో కోరడం విశేషం. ఆక్సిజన్ సరఫరా, వైద్య పరికరాల కోసం ఈ మొత్తాన్ని బిసిసిఐ విరాళంగా అందించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిల్‌లో న్యాయవాది కోరారు. పలువురు క్రికెటర్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో బిసిసిఐ ఐపిఎల్ ను అర్ధాంతరంగా వాయిదా వేసిన వేసింది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్నా పట్టించుకోకుండా లీగ్‌ను నిర్వహించి నష్టం కలిగించారని వందన షా బిసిసిఐపై కోర్టులో కేసును దాఖలు చేశారు. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా అల్లకల్లోల వాతావరణం నెలకొందని, ఇలాంటి స్థితిలో బాధ్యతతో వ్యవహరించాల్సిన బిసిసిఐ ఐపిఎల్‌ను నిర్వహించడం ద్వారా ఈ మహమ్మరి వ్యాప్తికి కారణమైందని న్యాయవాది పేర్కొన్నారు.
ఇలాంటి స్థితిలో భారత క్రికెట్ బోర్డు ఆర్జించిన లాభాలన్నీ విరాళంగా ఇవ్వాలనే వందనా షా డిమాండ్ చేశారు. అంతేగాక ఎవరి మాటలనూ ఖతారు చేయకుండా నిర్యక్షంగా వ్యవహరించి లీగ్‌ను నిర్వహించిన బిసిసిఐ క్షమాపణలు చెప్పాలని న్యాయవాది కోరారు. అంతేగాక ప్రస్తుతం శ్మశాన వాటికలపై భారం పెరగడంతో ప్రత్యేకంగా శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేలా బోర్డుకు ఆశేశాలు ఇవ్వాలని వందనా షా తన పిల్‌లో కోర్టును కోరారు. మరోవైపు ప్రజల సంక్షేమంపై బిసిసిఐ వైఖరెంటో తెలియజేయాలని పిటిషన్లో ఆమె డిమాండ్ చేశారు. ఇదిలావుండగా వందనా షా వేసిన పిల్ ఎప్పుడూ విచారణకు వస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. అంతేగాక ఆమె వేసిన కేసును కోర్టు విచారణకు స్వీకరిస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమే.
PIL Filed against BCCI for damages for Staging IPL 2021