Saturday, December 28, 2024

బిఆర్ఎస్ కు కోకాపేట భూమి.. హైకోర్టులో కేసు

- Advertisement -
- Advertisement -

కోకాపేటలో విలువైన స్థలాన్ని భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)కి కేటాయించడంపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వెంకటరామిరెడ్డి అనే న్యాయవాది ఈ కేసు దాఖలు చేశారు. మునుపటి బిఆర్ఎస్ ప్రభుత్వం గండిపేట మండలం  కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలోని 11 ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి పార్టీకి కేటాయించింది.

భూ కేటాయింపులో ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చారని, గుట్టు చప్పుడు కాకుండా కేటాయింపు జరిపారని న్యాయవాది ఆరోపించారు. బిఆర్ఎస్ కు కేటాయించిన భూమి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం కోట్లలో ఉంటుంది. అయితే ప్రభుత్వం కేవలం 3,41,25,000 రూపాయల నామమాత్రపు ధరకే బిఆర్ఎస్ కు అప్పగించిందని ఆయన ఆరోపించారు. కాగా గతంలో బిఆర్ఎస్ కు భూ కేటాయింపుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News