Wednesday, January 22, 2025

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై సుప్రీంలో పిటిషన్ దాఖలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంక కోర్టులో పిల్ దాఖలైంది. ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ చేతుత మీదుగా జరగనున్నట్లు ఇప్పటికే అధికార వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా.. ప్రధాని మోడీ ప్రారంభించనుండడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పిటిషనర్ పేర్కొన్నారు. మరోవైపు, 19 ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News