Tuesday, October 1, 2024

వాంగ్‌చుక్ అరెస్టుపై ఢిల్లీ హైకోర్టులో పిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌తోపాటు పలువురిని ఢిల్లీ సరిహద్దుల్లో సోమవారం రాత్రి అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో మంగళవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ లిస్టింగ్ కోసం పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా నేడే విచారణ చేపట్టేందుకు ధరాసనం నిరాకరించింది. అక్టోబర్ 3న సాయంత్రం 3.30 గంటల లోపల విచారణ చేపట్టేలా లిస్టింగ్ చేసేందుకు కోర్టు అంగీకరించింది.

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌కు ఆరవ షెడ్యూల్ ప్రతిపత్తిని కల్పించాలని డిమాండు చేస్తూ లేహ్ నుంచి దేశ రాజధానికి పాదయాత్ర చేపట్టిన వాంగ్‌చుక్‌తోపాటు దాదాపు 120 మందిని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేశారు. లడఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలని లేహ్ అపెక్స్ బాడీ(ఎల్‌ఎబి), కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్(కెడిఎ) గత నాలుగేళ్లుగా డిమాండు చేస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో లడఖ్‌ను చేర్చాలని, లడఖ్‌కు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు లేహ్, కార్గిల్ జిల్లాలకు ప్రత్యేక లోక్‌సభ స్థానాలు కేటాయించాలని వాంగ్‌చుక్ డిమాండు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News