Thursday, January 23, 2025

కుంగిన లక్ష్మీ(మెడిగడ్డ) బ్యారేజీ పిల్లర్

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర అత్యంత ప్రతిష్టాత్మక కా ళేశ్వర ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో అపశ్రుతి చోటు చేసుకుంది.శనివారం లక్ష్మీ(మెడిగడ్డ )బ్యారేజ్ చెందిన 20వ పిల్లర్ స్వల్పంగా కుంగింది. దీంతో అంతట ఆందోళన   వ్యక్త మైంది. సాయంత్రం సుమారు 6.30గంటల కుంగే సమయంలో భారీ శబ్ధం వినబడింది. దీంతో అక్కడే రెగ్యూలర్ మొయింటెన్స్ చేస్తున్న సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో హూట హూటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంగిన పిల్లర్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. సుమారు రెండు గంటల సమయం వరకు రాకపోకలను బంద్ చేయించారు అధి కారులు.అనంతరం ఇరిగేషన్, పోలీసులు బ్యారేజ్ వంతెనను పరిశీలించిన తర్వాత ఒక్కొక్క వా హనం వెళ్లాడానికి అనుమతి ఇచ్చారు.మరో వైపు ఇటు 20 వ పిల్లర్ కుంగడంతో దాని ప్రభావం ప్రధానంగా 19,21 పిల్లర్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనావేశారు.

శబ్ధంపై ఇరు రాష్ట్రాల పోలీసులకు ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు
లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ కుంగే సుమయంలో భారీ పేలుడు లాంటి శబ్ధం సూమారు కిలోమీటర్ మేర వినపడిందని అధికారులు చె బు తున్నారు. ఈ నేపథ్యంలో శబ్ధం వెనుక ఏమైనా అంసాఘిక శ క్తు లు ఉన్నాయా అనే కోణంలో అనుమానిస్తున్నారు. ఈ క్ర మ ం లోనే మహారాష్ట్ర సిరోంచ పో లీసులకు, ఇటు మహాదేవ్‌పూర్ పో లీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు.దీంతో పో లీ సు లు దీనిపై విచారణ చేపడుతున్నారు. హైదరాబాద్ నుండి క్లూ స్ టీం, ఇతర బృందాలుబ్యారేజీతో పాటు చుట్టూ పరిశీలి స్తున్నా రు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News