Saturday, December 21, 2024

శిక్షణ విమానం కూలి పైలట్ మృతి

- Advertisement -
- Advertisement -

 

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో గురువారం రాత్రి ఒక శిక్షణ విమానం కూలిపోయి అందులోని పైలట్ మరణించాడు. శిక్షణలో ఉన్న మరో పైలట్ గాయపడ్డాడు. పైలట్ కెప్టెన్ విశాల్ యాదవ్(30) రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో మరణించగా శిక్షణ పొందుతున్న పైలట్ అనుషుల్ యాదవ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక ఆలయ గోపురాన్ని, చెట్టును ఢీకొన్న అనంతరం విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News