Sunday, January 19, 2025

విమానం కాక్‌పిట్‌లో పైలట్ గర్ల్‌ఫ్రెండ్: డిజిసిఎ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం పైలట్ ఒకరు తన గర్ల్‌ఫ్రెండ్‌ను కాక్‌పిట్‌లో కూర్చోపెట్టుకున్న సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) దర్యాప్తు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న జరిగిన ఈ సంఘటనపై విమానానికి చెందిన సిబ్బంది ఒకరు డిజిసిఎకి ఫిర్యాదు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యవహారంపై డిజిసిఎ దర్యాప్తు చేస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు. ఈ సంఘటనలోని సాంకేతిక, భద్రతాపరమైన అంశాల గురించి దర్యాప్తు బృందం అధ్యయనం చేస్తుందని ఆయన చెప్పారు.

దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలోని కాక్‌పిట్‌లోకి తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఆ పైలట్ అనుమతించడంపై విమాన సిబ్బంది ఒకరు ఫిర్యాదు చేయడం విశేషం. విమానం కాక్‌పిట్‌లోకి ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. అలా ఇతరులను అనుమతించడం భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

Also Read: ఆ 40కోట్ల డీల్ సంగతేంది?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News