Sunday, November 17, 2024

రెండోసారి కేరళ సిఎంగా విజయన్

- Advertisement -
- Advertisement -

Pinarayi Vijayan sworn in as Kerala CM

 

కొవిడ్ ప్రోటోకాల్ మధ్య ప్రమాణం
అంతా కొత్త మంత్రులతో సంచలనం

తిరువనంతపురం : కేరళలో పినరయి విజయన్ రెండోసారి ముఖ్యమంత్రిగా గురువారం ప్రమా ణం చేశారు. ఎప్రిల్ మే నెల మధ్యలో కేరళ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో వరుసగా రెండోసారి సిపిఎం ఆధ్వర్యపు వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డిఎఫ్) అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. కేరళలో అధికార పక్షం తిరిగి రెండోసారి అధికారంలోకి రావడం అరుదు. ఇక్కడి సెంట్రల్ స్టేడియంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ 76 సంవత్సరాల విజయన్‌తో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ యుడిఎఫ్ నేతలు హాజరు కాలేదు. కరోనా కట్టడి ప్రాధాన్యత కీలకం అని, ప్రమాణస్వీకారానికి తక్కువ మంది హాజరు కావాలని కేరళ హైకోర్టు ఆదేశాలు వెలువరించడంతో అంతా పరిమితంగా జరిగింది.

విజయన్‌కు మరో ప్రత్యేకత కూడా దక్కింది. పూర్తిస్థాయి పదవికాలం తరువాత తిరిగి ఎన్నికయి, సిఎంగా కొనసాగిన కేరళ ముఖ్యమంత్రుల వరుసలో విజయన్ మూడో వ్యక్తిగా నిలిచారు. ఈసారి కేబినెట్‌లో విజయన్ అంతా కొత్తవారికే అవకాశం కల్పించారు. పాత కేబినెట్‌లోని వారెవ్వరికి అవకాశం ఇవ్వకుండా 11 మంది కొత్త మంత్రుల పేర్లను ప్రకటించారు. కేబినెట్‌లో మొత్తం 20 మంది ఉంటారని భావిస్తున్నారు. ఈసారి విజయన్ మంత్రివర్గంలోకి ఆరోగ్య మంత్రిగా సిపిఐకి చెందిన వీణా జార్జిని తీసుకుంటున్నారు. గతం లో జర్నలిస్టు అయిన వీణా జార్జి ఇప్పటివరకూ రాష్ట్రంలో ఆరోగ్య మంత్రిగా విశేష ఖ్యాతి దక్కించుకున్న శైలజ స్థానంలో వచ్చారు. అయితే పార్టీ ప్రయోజనాల నేపథ్యంలోనే కేబినెట్‌లో మార్పులు చేపట్టారని, ఇవి సహజం అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీలో స్పందించారు.

Pinarayi Vijayan sworn in as Kerala CM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News